తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్..రేపే ఖాతాల్లో సొమ్ము..?
వానాకాలంలో కోటిన్నర ఎకరాలకు రైతుబంధు పంపిణీ చేయాలని నిర్ణయించింది. వానాకాలంలో 63.25 లక్షల రైతులకు రూ.7508 కోట్లు పంపిణీ చేయబోతున్నారు. రైతుబంధు సొమ్ము జమ చేయడానికి వ్యవసాయ, ఆర్థిక శాఖలు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశాయి. రేపటి నుంచి రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బు వేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మొదట ఎకరాలోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతుంది. ఆ తర్వాత 2, 3, 4 ఎకరాల్లోపు వారి ఖాతాల్లో రైతు బంధు సొమ్ము జమ చేస్తారు.
తెలంగాణ ప్రభుత్వం ఎకరానికి రూ. 5000 చోప్పున రైతు బంధు పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. రైతులు పెట్టుబడి సాయం కోసం వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లకుండా చేయాలన్నదే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం.. పంట వేసుకునేందుకు అయ్యే ఖర్చులను ప్రభుత్వమే రైతు బంధు పథకం ద్వారా అందజేయడం ద్వారా రైతులను అప్పులబారి నుంచి కాపాడాలని సీఎం కేసీఆర్ ఈ రైతు బంధు పథకం రూపొందించారు.
ఆ తర్వాత కాలంలో ఈ రైతు బంధు పథకం దేశవ్యాప్తంగా చర్చనీయాశం అయ్యింది. ఈ పథకం ఆధారంగానే కేంద్రం కూడా రైతులకు నగదు బదిలీ చేస్తోంది. పలు రాష్ట్రాలు కూడా తెలంగాణలో జరుగుతున్న రైతు బంధు పథకం గురించి ఆరా తీస్తున్నాయి. రైతును బలోపేతం చేస్తే దేశం బలోపేతం అవుతుందన్నది ఈ రైతు బంధు కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం.