‘కమ్మ’ని రాజకీయం: టీడీపీలో స్ట్రాంగ్...వైసీపీలో వీక్?

M N Amaleswara rao
రాజకీయాల్లో కులాలు ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అసలు కులాలు బట్టే రాజకీయాలు నడుస్తాయి. ఇందులో ఏ మాత్రం అనుమానం లేదనే చెప్పొచ్చు. కుల సమీకరణాల బట్టే నేతలు రాజకీయాలు చేస్తుంటారు. ఇక ప్రధాన పార్టీల్లో కొన్ని కులాల డామినేషన్ ఉన్న విషయం తెలిసిందే. అధికార వైసీపీలో రెడ్డి, ప్రతిపక్ష టీడీపీలో కమ్మ వర్గం హవా ఎక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే.

పైగా వైసీపీలో రెడ్డి వర్గం నేతలు బాగా స్ట్రాంగ్‌గా ఉంటారు..టీడీపీలో ఏమో కమ్మ వర్గం నేతలు స్ట్రాంగ్‌గా ఉంటారు. అయితే ఎమ్మెల్యేల విషయంలో అదే సీన్ కనిపిస్తోంది. ఎందుకంటే వైసీపీలో ఉన్న రెడ్డి ఎమ్మెల్యేలు బాగా స్ట్రాంగ్‌గా కనిపిస్తుంటే, టీడీపీలో ఉన్న కమ్మ ఎమ్మెల్యేలు స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నారు. ఎలాగో జగన్ మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడులని పక్కనబెడితే..వైసీపీలో స్ట్రాంగ్‌గా ఉన్నది రెడ్డి ఎమ్మెల్యేలు.

వైసీపీలో మెజారిటీ రెడ్డి ఎమ్మెల్యేలు స్ట్రాంగ్‌గా ఉన్నారు. ఇటు టీడీపీలో కమ్మ ఎమ్మెల్యేలు స్ట్రాంగ్..గత ఎన్నికల్లో టీడీపీలో సగం మంది కమ్మ ఎమ్మెల్యేలే గెలిచారు. కానీ ఒక్క రెడ్డి ఎమ్మెల్యే కూడా గెలవలేదు. అయితే వైసీపీలో కమ్మ ఎమ్మెల్యేలు కొందరు గెలిచారు. కొడాలి నాని, వసంత కృష్ణప్రసాద్, అబ్బయ్య చౌదరీ, బొల్లా బ్రహ్మనాయుడు, నంబూరు శంకర్ రావు, అన్నాబత్తుని శివకుమార్‌లు వైసీపీలో గెలిచిన కమ్మ ఎమ్మెల్యేలు. వీరిలో కొడాలి గురించి చెప్పాల్సిన పని లేదు. ఆయన ఇప్పటికీ స్ట్రాంగ్‌గానే ఉన్నారు. కానీ మిగిలిన ఎమ్మెల్యేల పరిస్తితి డౌట్‌గా ఉంది.

వసంత, బొల్లా, అన్నాబత్తుని, అబ్బయ్య చౌదరీలు ఎక్కువ ప్రజా వ్యతిరేకతని ఎదురుకుంటున్నారు. అటు శంకర్ రావు పరిస్తితి కాస్త పర్లేదు. కానీ మిగిలిన కమ్మ ఎమ్మెల్యేలు మళ్ళీ గెలవడం కష్టమనేలా పరిస్తితి ఉంది. ఇక టీడీపీ నుంచి వల్లభనేని వంశీ, కరణం బలరాంలు వైసీపీ వైపుకు వచ్చిన విషయం తెలిసిందే. వీరి పరిస్తితి ఇప్పుడే చెప్పలేం. మొత్తానికైతే కమ్మ ఎమ్మెల్యేలు టీడీపీలో స్ట్రాంగ్‌గా ఉంటే, వైసీపీలో వీక్‌గా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: