జగన్ కి షాకిచ్చిన సజ్జనార్.. వారెవ్వా ఏం ప్లాన్?

praveen
ఒకప్పుడు సైబరాబాద్ సీపీ గా బాధ్యతలు నిర్వహించిన సజ్జనార్ ఎంత దూకుడుగా వ్యవహరించే వారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా సజ్జనార్ పేరెత్తితే చాలు నేరస్తుల వెన్నులో వణుకు పుట్టించారు అని చెప్పాలి. అంతలా సజ్జనార్ తీసుకున్న నిర్ణయాలు ప్రభావం చూపించాయి.. అయితే ఇటీవల తెలంగాణ ఆర్టీసీ ఎండీగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అటు ఆర్టీసీ ఎండీగా అదే దూకుడును కొనసాగిస్తున్నాడు అని చెప్పాలి. కొంతకాలం నుంచి సజ్జనార్ తీసుకునే ప్రతి నిర్ణయం కూడా సంచలనం గా మారిపోతుంది. టీఎస్ ఆర్టీసీ ని ప్రయాణికులకు మరింత దగ్గర చేసేందుకు సజ్జనార్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.


 ఒకవైపు ప్రయాణికులు అందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సర్వీసులు అందుబాటులో  ఉంచడమే కాదు మరోవైపు ఆర్టీసీ సంస్థను కూడా లాభాల బాటలో తీసుకు వచ్చేందుకు సజ్జనార్ సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు . దీనికోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు సజ్జనార్. అంతేకాదు ఎప్పటికప్పుడు బస్సులో ప్రయాణిస్తూ ప్రయాణికుల అవసరాలను ఇబ్బందులను కూడా తెలుసుకుంటూ ఉన్నారు. ఇక ఇప్పుడు ఇటీవలే సజ్జనార్ తీసుకున్న నిర్ణయం ఏపీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది అని చెప్పాలి. సాధారణంగా పండగలు వచ్చే సమయంలో అటు తెలంగాణ నుంచి ఏపీకి రాకపోకలు ఎక్కువగా ఉంటాయి.


 ఉద్యోగం వ్యాపారం నిమిత్తం తెలంగాణ కు వచ్చిన వారు ఆంధ్ర కి పండక్కి వెళ్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎక్కడ చూసినా బస్సులు రైళ్ళు ఫుల్ గా కనిపిస్తూ ఉంటాయి. సాధారణంగా పండుగ సమయంలో అటు ఛార్జీలు పెంచడం లాంటివి చేస్తూ ఉంటాయి ఇరు రాష్ట్రాల ఆర్టీసీ సంస్థలు. కానీ ఇటీవల సజ్జనార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.. ఈ పండక్కి ఆర్టీసీ చార్జీలు పెంచడం లేదు అంటూ తెలిపారు. తక్కువ చార్జీలతో ప్రయాణించాలి అనుకునేవారు ఏపీఎస్ ఆర్టీసీ బదులు తెలంగాణ ఆర్టీసీ లో ప్రయాణించాలి అంటూ తెలిపారు. టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తీసుకున్న  జగన్ సర్కార్కు కొత్త సవాలు విసిరింది అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: