తాలిబన్ల కొత్త కోణం.. దానికి ఓకే.. కానీ?
మహిళను మనుషులుగా కాదు కేవలం సెక్స్ బొమ్మలుగా మాత్రమే చూస్తున్నారు. కనీస హక్కులు లేకుండా ఎన్నో కఠిన ఆంక్షలు అమలులోకి తీసుకు వస్తున్నారు. ఇప్పటికే మహిళలు ఉద్యోగాలు చేయకూడదు ఆంక్షలు విధించారు. ప్రభుత్వ ఆంక్షలతో ఇప్పటికే ఎంతోమంది మహిళలు ఉద్యోగాలు కోల్పోయి ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అదే సమయం లో మహిళలు చదువుకోవడానికి కూడా వీలు లేదు అంటూ ఆంక్షలు విధించారు తాలిబన్లు. అయితే మహిళలపై వివక్ష నేపథ్యంలో అటు తాలిబన్ల తీరుపై ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత వస్తోంది.
ఇలాంటి పరిస్థితుల నేపథ్యం లో అటు తాలిబన్లు కాస్త వెనక్కి తగ్గి మహిళల చదువు విషయం లో కొత్త రూల్స్ తెరమీదకు తీసుకువచ్చారు. ఆడ పిల్లలు చదువుకోవడానికి అంగీకరిస్తాం కానీ అబ్బాయితో కలిసి చదువుకోడానికి మాత్రం అస్సలు అంగీకరించబోమని అంటూ తాలిబన్లు సరికొత్త రూల్స్ తెరమీదకు తీసుకువచ్చారు.. ఆడ మగ కలిసి చదువు కోవడం ఇస్లామిక్ కు వ్యతిరేకం అంటూ స్టేట్ మెంట్ ఇచ్చింది తాలిబన్ల ప్రభుత్వం. అందుకే తమ దేశంలో కో-ఎడ్యుకేషన్ అనుమతించబోమని కానీ మహిళలు ప్రత్యేకమైన పాఠశాలలు కళాశాలలో చదువుకునేందుకు అవకాశం కల్పిస్తామని తాలిబన్లు తెలిపారు.