హెరాల్డ్ ఫ్లాష్ బ్యాక్ 2021: టిడిపి ఇది దౌర్భాగ్యపు సంవత్సరం


అవును ఇది నిజం. తెలుగదేశం  పార్టీ మునుపెన్నడూ లేనంత దౌర్భాగ్యపు స్థితిని ఎదుర్కోన్నది ఈ ఏడాదిలేనే.  తెలుగుదేశం పార్టీ  ఆంధ్ర ప్రదేశ్ లో ఈ రోజు విలవిల లాడుపోతున్నదంటే అందుకు కారణం ఎవరిని అడిగినా చెప్పకనే చెబుతారు.  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం వేరుపడిన తరువాత  అధికారం చేపట్టిన  తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వ్యాపార వేత్తల కే ప్రాముఖ్యత నిచ్చారు అన్న విషయం అందరికీ తెలిసిందే.  ఆయన పక్కన నుండిన  నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణ,  వ్యాపార, పారిశ్రామిక వేత్తలు  సి.ఎం. రమేష్,  సుజనా చౌదరి, పత్తిపాటి పుల్లారావు, శిద్దా రాఘవ రావు,  పోతుల రామారావు... ఇలా రాసుకుంటూ పోతే  ఎందరో.. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నన్నాళ్లూ పెత్తనం చెలాయించిన  వారు ఆయనకు మచ్చుకు కూడా  అండగా నిలబడలేదన్నది సత్యం. ఈ  స్థితి గతులు ఈ ఏడాది వచ్చినవి కాకపోవచ్చు, కానీ గతం చేసిన గాయం తాలుకూ వచ్చిన మంటలు ఈ ఏడాది కూడా  చంద్రబాబును , ఆయన పార్టీని బాధించాయని చెప్పవచ్చు. ఆర్థిక మూలాలు, బంగారు బాతులను చంద్రబాబు నాయుడు వారి చేతుల్లో అప్పనంగా అప్పజెప్పి, ఈ ఏడాదంతా ఆ పూటకు ఠికానా లేని నాయకుడుగా మిగిలిపోయారనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఈ మాటలు నేను అంటున్నందుకు ఆ పార్టీ శ్రేణులు బాధ పడవచ్చు. కానీ ఇది నిజం. నిజం ఎప్పుడూ  నిష్టూరంగా ఉంటుంది.ఒకింత సంతోషించ తగ్గ విషయం...కించిత్తు గర్వ పడాల్సిన విషయం ఏమిటంటే.... రాజకీయమే జీవితంగా  ఉన్న మారు మాత్రం ఆయనతోనే ఉండటం. అయితే వారేవరికీ ఆధికార వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఎదుర్కోనే స్తోమత లేదనే విషయం ఇక్కడ గమనించాలి.అధికారం లేకపోయినా,   కనుచూపు మేరలో కనిపిస్తుండక పొయినా రాజకీయ పార్టీలు అంతరించి పోవడం ఖాయం అన్న విషయం ప్రచారం  నానాటికీ ఉధృతమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: