ఒమిక్రాన్: అక్కడ హాస్పిటల్స్ అన్నీ పిల్లలతో ఫుల్

VAMSI
కరోనా థర్డ్ వేవ్ లో అత్యదికంగా పిల్లల పైనే దాని ప్రభావం ఉండబోతుందని వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు ముందు నుండి చెబుతూనే వచ్చారు. గత రెండేళ్ల నుండి కరోనా మహమ్మారి ప్రపంచ దేశ ప్రజలను నానా కష్టాలు పెడుతోంది. మొదట వయసు పైబడిన వారిపై ప్రభావం చూపిన కరోనా సెకండ్ వేవ్ లో డెల్టా వేరియంట్ అంటూ ఎందరో యువత ప్రాణాలను బలిగొంది. యువతపై విరుచుకుపడింది. ఇక ఇప్పుడేమో రూపాంతరం చెంది ఒమిక్రాన్ అని తన పంజా విసురుతోంది. తెలుగు రాష్ట్రాలలోనూ రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 50 దాటింది.
ఇక అమెరికాలో తీవ్రత చూస్తుంటే రానున్న రోజుల్లో పిల్లలపై ఈ ఒమిక్రాన్ ప్రభావం మరింత పెరుగుతుందని తెలుస్తోంది. గత వారంలో సెంటర్ ఫర్ డిసీజెస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకటించిన వివరాల ప్రకారం. డెల్టా కేసులు 27శాతానికి తగ్గగా.. ఒమిక్రాన్ కేసులు మాత్రం ఒక్కసారిగా 73 శాతానికి ఎగబాకాయట. అంటే కేవలం వారం రోజుల వ్యవధిలో ఒమిక్రాన్ కేసులు సగటున రోజుకు 1.90 లక్షలుగా నమోదు అవుతూ భయాందోళనలు పెంచుతున్నాయి. ఇంకోవైపు న్యూయార్క్ హాస్పిటళ్లలో ఒమిక్రాన్ వైరస్ కారణంగా చేరుతున్న పిల్లల సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది. న్యూయార్క్ హాస్పిటళ్లలో అప్పుడే బెడ్స్ దొరకని పరిస్థితులు ఎదురవుతుండటం గమనార్హం.
ఈ నెల 5న ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు చూస్తే 18ఏళ్ల లోపు వారు నాలుగు రెట్లు అధికంగా ఒమిక్రాన్ భారిన పడి హాస్పిటల్స్ లో చేరుతున్నారు. అందులోనూ వారిలో సగం మంది 5 సంవత్సరాలలోపు పిల్లలే ఉండడం ఎక్కువ భయపెడుతోంది. ఎందుకంటే ఐదేళ్ల లోపు చిన్నారులు టీకాకు అర్హులు కాదని న్యూయార్క్ స్టేట్ డిపార్ట్ మెంట్ ఆఫ్ హెల్త్ తెలిపిన విషయం తెలిసిందే. కాగ్ ఆ వయసులోపు చిన్నారులు ఎక్కువ మంది ఒమిక్రాన్ తో హాస్పిటల్స్ లో చేరుతున్నారు. పిల్లల విషయంలో అత్యంత జాగ్రత్త వహించాల్సిన సమయం ఇది. నిబంధనలు తప్పక పాటించి  చిన్నారులను ఒమిక్రాన్ భారిన పడకుండా చూసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: