ఒమిక్రాన్ నుండి కాపాడే "బూస్టర్ డోసు"కు మీరు అర్హులా కాదా?
దాంతో ప్రపంచ దేశాలు మళ్ళీ వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశాయి. ఇప్పటికే దేశంలోని చాలా మంది ప్రజలకు వ్యాక్సిన్ రెండు డోసులు ఇవ్వగా ఇపుడు ఒమిక్రాన్ విజృంభిస్తున్న నేపథ్యంలో.. అదనంగా బూస్టర్ డోసు కూడా అందించేందుకు సన్నాహాలు మొదలు పెట్టారు. తాజాగా భారత్ కూడా కోవిడ్ బూస్టర్ డోసును ఇవ్వబోతున్నట్లు అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. కాకపోతే ఈ డోసు అందరికి ఇవ్వడం లేదని క్లియర్ గా చెప్పింది. ఈ మూడవ బూస్టర్ డోస్ జనవరి 10, 2022 నుండి కోవిడ్-19 ముందస్తు డోస్ దేశ ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు పిఎం నరేంద్ర మోడీ తెలియచేశారు.
అయితే ఒమిక్రాన్ వ్యాప్తి పెరుగుతున్న సమయంలో అత్యవసరం అన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుగా బూస్టర్ డోస్ లను హెల్త్‌కేర్ ఫ్రంట్‌లైన్ వర్కర్లకు.. అలాగే 60 ఏళ్లు వయసు పైబడిన వారు ఈ డోస్ తీసుకునేందుకు అర్హులని తెలిపారు. అయితే సీనియర్ సిటిజన్లు బూస్టర్ డోసుకు వేయించుకోవాలి అంటే తమ అనారోగ్య సమస్యలకు సంబంధించి వైద్య ధృవీకరణ పత్రాన్ని తమతో పాటుగా వ్యాక్సినేషన్ కేంద్రానికి తీసుకువచ్చి చూపించాలి. రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ నుంచి సర్టిఫికేట్ పొందవలసి ఉంటుంది. ఇక ఈ మూడవ డోసు తీసుకోవాలంటే కోవిడ్ రెండవ డోస్ వేసుకున్న 9 నుంచి 12 నెలలు తర్వాతనే ఈ బూస్టర్ డోస్ ను వేసుకోవాలి అని అధికారులు స్పష్టం చేశారు.