సినిమా టికెట్ల ధ‌ర‌లపై ఏపీ మంత్రి పేర్నినాని ఏమ‌న్నారంటే..?

N ANJANEYULU
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఆన్‌లైన్ టికెట్ల వ్య‌వ‌హారం పెను దుమార‌మే  రేగింది కొద్ది రోజుల పాటు.  ఏపీలో ప‌రిస్థితి జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ‌ర్సెస్ టాలీవుడ్ ఇండ‌స్ట్రీ మ‌ధ్య వార్ అన్న‌ట్టు ఉండేది. టికెట్ల ధ‌ర‌లు త‌గ్గించ‌డం జ‌రిగింద‌ని.. ఆ వ్య‌వ‌హారంలో వెనుక‌డుగు వేసే ప్ర‌స‌క్తే లేదని, ప్ర‌భుత్వం తెగేసి చెప్పడంతో..  సినిమా పెద్ద‌లు, నిర్మాత‌లు, డిస్ట్రిబ్యూట‌ర్లు ప‌లుమార్లు  విన‌తి ప‌త్రాలు అందించారు.

ఏపీలో ప్రస్తుతం సినిమా టికెట్ల ధరలు, సినిమా థియేటర్ల మూసివేత  ప్ర‌స్తుతం  హాట్‌ టాపిక్‌గా మారిన‌ది. ఈ  త‌రుణంలోనే  ఇవాళ  సినిమాటో గ్రఫీ మంత్రి పేర్ని నానితో సినిమా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు సమావేశం అయ్యారు. సుమారు గంటన్నర పాటు మంత్రి పేర్ని నానితో టికెట్ల ధరలు, థియేటర్ల మూసివేతపై చర్చించి వారి ప్రతిపాదనల‌ను అందించారు.

సినిమాటోగ్ర‌ఫీ మంత్రి పేర్నీ నాని మీడియాతో మాట్లాడారు. సినిమా హాళ్లలో వసతులు మెరుగు ప‌ర‌చాల‌ని  గతంలోనే చెప్పామని, సమయం ఇచ్చినా మార్పు లేకపోవడంతో తనిఖీలు చేసామ‌ని పేర్కొన్నారు.  కనీసం థియేటర్లు రెన్యూవల్‌ చేయకుండా నడిపిస్తున్నామ‌ని  మంత్రి పేర్ని వెల్లడించారు. అందుకు అనుమతులు లేకుండా నడుపుతున్న థియేటర్లను సీజ్ చేసామని స్పష్టం చేసారు. అదేవిధంగా  సినిమా ఇండస్ట్రీ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం పరిశీలిస్తున్న‌ద‌ని ఆయన తెలిపారు.

అయితే కార్పొరేషన్‌ల‌లోని ఏసీ థియేటర్లలో గరిష్ఠ ధర రూ.150, కనిష్ఠ ధర రూ. 50, నాన్‌ ఏసీ థియేటర్లలో గరిష్ఠ ధర రూ. 100, కనిష్ఠ ధర రూ.40, కార్పొరేషన్‌ మినహా ఏసీ థియేటర్లలో గరిష్ఠ ధర రూ. 100, కనిష్ఠ ధర రూ. 40, నాన్‌ ఏసీ థియేటర్లలో గరిష్ఠ ధర రూ. 80, కనిష్ఠ ధర రూ. 30 గా టికెట్ల ధరలు ఉండాలని డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కోరారు అని మంత్రి పేర్నినాని తెలిపారు.  అదేవిధంగా  4 వారాల సమయం ఇస్తే థియేటర్లు రెన్యూవల్‌ చేసుకునేలా చర్యలు తీసుకుంటామని అన్న‌ట్టు  ఆయన  వెల్ల‌డించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: