చైనాకు షాకిద్దాం రండి.. కెనడా పిలుపు?

praveen
ఒకప్పుడు రాజులు తమ సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు ఇతర రాష్ట్రాలపై యుద్ధం చేసి వారిని ఓడించి వారి రాజ్యాలను కూడా స్వాధీనం చేసుకునే వారు. సామ్రాజ్యవాద ధోరణితో ముందుకు సాగేవారు. అయితే ఇటీవలి కాలంలో ప్రజాస్వామ్య పాలన కొనసాగుతుంది కాబట్టి అలాంటివి ఎక్కడా జరగడం లేదు. కానీ నేటి ప్రజాస్వామ్యంలో కూడా నియంత పాలన సాగిస్తూ సామ్రాజ్యవాద ధోరణితోముందుకు సాగుతూ ఒక అప్పటి రాజుల కాలాన్ని గుర్తు చేస్తుంది చైనా. ఒకప్పుడు యుద్ధం చేసి ఇతర రాజ్యలను స్వాధీనం చేసుకునే వాళ్లు. కానీ ఇప్పుడు మాత్రం చైనా నక్క జిత్తుల మారి కుట్రలతో ఇతరదేశాల నుండి భూభాగాలను స్వాదినం చేసుకుంటూ ఉండటం గమనార్హం.

 సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు సృష్టిస్తూ ఇతర దేశ ఆర్మీని భయపెడుతూ కొన్ని దేశాలానే  స్వాధీనం చేసుకుంటు ఉంటే ఇక మరికొన్ని సార్లు ఆర్థిక సహాయం పేరుతో ఎన్నో దేశాలకు అప్పులు ఇచ్చి తర్వాత తీర్చ లేకుండా ఉన్న సమయంలో ఇక ఇతర దేశాలలో భూభాగాలను స్వాధీనం చేసుకొని సైనిక స్థావరాల ఏర్పాటు చేసుకోవడం లాంటివి కూడా చేస్తుంది చైనా. ఇక పొరుగున ఉన్న ఎన్నో చిన్న దేశాలను చైనాలో కలుపుకోవడానికి సామ్రాజ్యవాద ధోరణితో ముందుకు సాగుతోంది. ఇలా గత కొంతకాలం నుంచి చైనా వ్యవహరిస్తున్న తీరు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారి పోతుంది అని చెప్పాలి. ఇలా విస్తరణ ధోరణితోనే చుట్టుపక్కల ఉన్న అన్ని దేశాలతో కూడా వివాదం పెట్టుకుంది చైనా.

ప్రపంచ దేశాలపై ఆధిపత్యం సాధించేందుకు ఎన్నో కుట్రలు పన్నుతోంది చైనా. ఇప్పటికే హాంకాంగ్, టిబెట్ లాంటి దేశాలను చైనాలో కలుపుకుంది. ఈ క్రమంలో చైనా విస్తరణ వాద ధోరణిపై ప్రపంచ దేశాలు యుద్ధం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ ఇటీవల కెనేడా పిలుపునిచ్చింది. కెనడా ప్రధాని ఇటీవల దీనికి సంబంధించి స్టేట్మెంట్ విడుదల చేశారు. చైనా ఆక్రమణలను చొరబాట్లకు చెక్ పెట్టేందుకు అన్ని దేశాలు కలిసి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని. లేదంటే రానున్న రోజుల్లో పెను ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది  అంటూ కెనడా ప్రధాని పిలుపునిచ్చారు. మరీ దీనిపై ప్రపంచ దేశాలు ఎలా స్పందిస్తాయి అనేది హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: