రష్యా షాకింగ్ నిర్ణయం.. ఇది కొత్త ప్లానా ఏంటి?
అయినప్పటికీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాత్రం ఎక్కడా వెనకడుగు వేయడం లేదు. ఉక్రెయిన్ విషయంలో మొండి పట్టు తో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేది కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇప్పటికే ఉక్రెయిన్ సరిహద్దుల్లో లక్షా 90వేల మంది సరిహద్దులను మొహరించి భారీగా యుద్ధ విన్యాసాలు చేయడం మొదలుపెట్టింది రష్యా. అదే సమయంలో ఉక్రెయిన్ విషయంలో ఏకంగా యుద్ధం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్టేట్మెంట్లు కూడా అటు వివాదాన్ని మరింత హాట్ హాట్గా మార్చేశాయి.
అయితే మొన్నటి వరకు ఎంతో మొండిగా ముందుకు సాగిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇప్పుడు వెనక్కి తగ్గారా అంటే ప్రస్తుతం తీసుకున్న నిర్ణయం అలాగే కనిపిస్తోందని అంటున్నారు విశ్లేషకులు. ఇటీవలే ఉక్రెయిన్ సరిహద్దుల్లో 190000 సైనికులను యుద్ధ విన్యాసాలు చేయడానికి ఒక్కసారిగా మోహరించింది రష్యా. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ తో యుద్ధం చేయడానికి ఇలాంటి మొహరింపు జరిగింది అని అనిపించింది. కానీ ఇప్పుడు మాత్రం రష్యా ఇచ్చిన స్టేట్మెంట్ కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది. ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా సైన్యం కేవలం యుద్ధ విన్యాసాలు చేయడానికి మాత్రమే వ్యవహరించామని ఇప్పుడు యుద్ధవిన్యాసాలు ముగియడంతో మళ్లీ సైనికులను బేస్ కి తరలిస్తున్నామని అంటూ స్టేట్ మెంట్ ఇచ్చింది రష్యా .దీంతో పుతిన్ వెనక్కి తగ్గారా లేక కొత్త వ్యూహం మొదలు పెట్టారా అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.