చైనాలో గాలి వస్తే.. ఏపీలో గొడుగులు వేసే పార్టీ సీపీఐ !

Veldandi Saikiran
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో పార్టీ దూకుడు పెంచుతుంది. ఏపీలో శూన్యత ఉందన్నారు సోము వీర్రాజు. ఏపీలో బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదుగుతోందని.. అన్ని పార్టీలకు ప్రత్యామ్నాయ ప్రతిపాదనలుంటే.. బీజేపీ దగ్గర ప్రత్యామ్నాయ విధానాలు ఉన్నాయని... మేం ట్రేడింగ్ చేయం.. రూలింగ్ చేస్తామని హెచ్చరించారు సోము వీర్రాజు. రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్రలో పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణంపై ఉద్యమించనున్నామని.. ఉత్తరాంధ్ర జిల్లాలో బీజేపీ ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తుందని పేర్కొన్నారు సోము వీర్రాజు. శ్రీకాకుళం జిల్లాలో ఒక్క హర్బర్, బెర్తుల్లేవా..? రాష్ట్ర మత్స్య శాఖ మంత్రికి ఎంత బడ్జెట్ ఉంటుందో.. అంత నిధులను మేం చేస్తారో తెలుసా ? అని నిలదీశారు.  

గత ప్రభుత్వంలో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఓ వ్యక్తి నుంచి రూ. 100 కోట్లు తీసుకుని అతనికి బెర్తుల నిర్మాణం పనులన్నీ కేటాయించేశారని..  మేం ఓపెన్ ఆఫర్ ఇస్తున్నాం.. బొత్సను మా పార్టీలోకి రమ్మనండని సవాల్ విసిరారు సోము వీర్రాజు.   సీపీఐ ఓ పార్టీనా..? ప్రతి రోజూ అడుక్కోవడమేనని... రామకృష్ణ రోజూ ఎంత మంది దగ్గరకు వెళ్తారో నాకు తెలుసు అంటూ చురకలు అంటించారు. చైనాలో గాలే వస్తే.. ఏపీలో గొడుగులు వేసే పార్టీ సీపీఐ అని ఎద్దేవా చేశారు సోము వీర్రాజు.

మద్యం రేట్లు తగ్గిస్తే ఆడపడుచుకు ఆరు వేలు.. ఇచ్చినట్టు... అందుకే మద్యం రేట్లు తగ్గిస్తామని చెప్పానన్నారు సోము వీర్రాజు. సినిమా టిక్కెట్ల ధరలను ఎందుకు తగ్గించారు..? మద్యం పేరుతో పేదల సంపాదనను లాక్కొంటారా..? ఇది మంచిది కాదు... జేబులు కత్తిరించే కత్తెర బ్యాచ్ తరహాలో మద్యం పేరుతో పేదలను దోచేస్తున్నారని ఫైర్ అయ్యారు సోము వీర్రాజు.  మేం కూడా ఇతర పార్టీలకు ట్రబుల్స్ క్రియేట్ చేయబోతున్నాం.రైల్వే జోన్ గురించి మాట్లాడే వాళ్లు పెండింగ్ రైల్వే ప్రాజెక్టులకు రాష్ట్ర వాటా ఎందుకివ్వలేదు..? విశాఖ స్టీల్ ప్లాంటుపై మాట్లాడుతోన్న మా మిత్రపక్షం జనసేన కూడా ఆ సమస్యలపై ఉద్యమించాలని కోరుతున్నానని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: