అమూల్ కి బ్రాండ్ అంబాసిడరుగా సీఎం జగన్ ?

Veldandi Saikiran
అమరావతి :   టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి అలవోకగా అబద్ధాలు చెబుతున్నారని.. అర్థ స త్యాలు, అసత్యాల తో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం లోని పాడి రై తులను మోసగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ధూళిపాళ్ల నరేంద్ర. అధికారం లోకి వచ్చి రెండున్న రేళ్లు అయినా లీటర్ పాలకు ఇస్తానన్న రూ. 4 ల  బోనస్ జగన్ ఎందుకు ఇవ్వడం లేదు ? అని ఓ రేంజ్‌ లో రెచ్చి పోయారు ధూళిపాళ్ల నరేంద్ర.  1950, 60 దశకా ల్లో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం లో ప్రారంభమైన పాడిరైతుల సహాకారసమాఖ్యల మూసివేతకు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఫైర్‌ అయ్యారు ధూళిపాళ్ల నరేంద్ర. సీఎం జగన్ అమూల్ కి బ్రాండ్ అంబాసిడరుగా వ్యవహరిస్తున్నారని.. ఏపీ లోని పాల డెయిరీలను సీఎం జగన్ నిర్వీర్యం చేస్తున్నారని రెచ్చి పోయారు ధూళిపాళ్ల నరేంద్ర.


అమూల్ కోసం రూ.2,500ల ప్రభుత్వ సొమ్ము ఖర్చుపెడుతున్న జగన్.. మూతపడిన ఒంగోలు డెయిరీకి రూ.150 కోట్లు కేటాయించ లేరా..? అని నిలదీశారు ధూళిపాళ్ల నరేంద్ర.  దాదాపు 30 వేల మంది రైతుల నుంచి 168 లక్షల లీటర్ల పాలను అమూల్  సేకరిస్తోందని, రూ.71 కోట్లను పాడి రైతులకు అందించిందని జగన్ చెబుతున్నారని ఫైర్‌ అయ్యారు ధూళిపాళ్ల నరేంద్ర. ఆయన లెక్కప్రకారం అమూల్ సంస్థ లీటర్ పాలకు రూ.42.50 పైసలు చెల్లిస్తుంటే, జగన్మోహన్ రెడ్డి రూ.70లు అని చెప్పడం పచ్చి అబద్ధం కాదా ? అని నిలదీశారు ధూళిపాళ్ల నరేంద్ర.  విజయ డెయిరీ 11 శాతమున్న లీటర్ పాలకు రూ.85.55పైసలు ఇస్తుంటే, అమూల్ సంస్థ ఇస్తున్నది కేవలం రూ.77లు మాత్రమే నని చెప్పారు ధూళిపాళ్ల నరేంద్ర.  

రూపాయి పెట్టుబడి లేకుండా వ్యాపారం చేస్తున్న అమూల్ డెయిరీ వల్ల రాష్ట్రానికి అప్పులే మిగులుతాయని... కృష్ణామిల్క్ యూనియన్ సహా, రాష్ట్రంలోని మిల్క్ డెయిరీలను నిర్వీర్యం చేయాలన్నదే సీఎం జగన్ లక్ష్యమని ఓ రేంజ్‌ లో రెచ్చి పోయారు ధూళిపాళ్ల నరేంద్ర.  పశువుల బీమాకు సంబంధించిన సొమ్ముని ఎగ్గొట్టిన వైసీపీ ప్రభుత్వం, గోపాల మిత్రల భవిష్యత్తును అంధకారం చేసిందని.. పశువైద్యులు వైద్యసేవలకు స్వస్తి పలికి, ప్రభుత్వం చెప్పే అడ్డమైన పనులకే ప్రాధాన్యత ఇస్తున్నారని మండి పడ్డారు ధూళిపాళ్ల నరేంద్ర.  సేవా భావంతో పశువుల దాణా అమ్మేవారు ప్రభుత్వానికి రూ. 25వేల డిపాజిట్ కట్టాలనడం దుర్మార్గం కాదా ? అని ఆగ్రహం వ్యక్తం చేశారు ధూళిపాళ్ల నరేంద్ర.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: