దిగివచ్చిన దుబాయ్.. భారత్ తో కీలక ఒప్పందం?
ఈ క్రమంలోనే అటు ఆయిల్ కంట్రీస్ కి రోజు రోజుకి అన్ని దేశాల నుంచి దిగుమతి తగ్గిపోతూ ఉండడం గమనార్హం. ఇలాంటి సమయంలోనే ఇక ప్రస్తుతం దుబాయ్ లాంటి దేశాలు ప్రత్యామ్నాయాలపై ఎక్కువగా దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది. రేపటి గురించి ఆలోచించకపోతే ఈరోజే నష్టపోతామని ధోరణితో ప్రస్తుతం అరబ్ కంట్రీస్ అన్నీ కూడా వినూత్నమైన పోకడలు పోతూ ఉంటాయి. నిబంధనల కారణంగా విదేశీయులు రాకపోకలు తగ్గుతున్నాయి అని ఆలోచించి విదేశీయులు అందరికీ పూర్తి స్వేచ్ఛ యుత వాతావరణాన్ని కల్పిస్తున్నాయి అరబ్ కంట్రీస్. అంతేకాకుండా మహిళలపై ఉన్నా ఆంక్షలను కూడా తొలగిస్తూ వస్తున్నాయి. ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం కూడా కొత్త కొత్త పోకడలకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ఆయిల్ ద్వారా సంపాదించిన లక్షల కోట్ల రూపాయల నిధులతో ప్రస్తుతం ఇతర వ్యాపారంలోకి దిగాలని అరబ్ కంట్రీస్ లో ఉన్న ధనికులు అందరూ భావిస్తున్నట్లు తెలుస్తుంది . ఈ క్రమంలో ఎన్నో దేశాల్లో ప్రస్తుతం పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు అన్నది అర్థం అవుతుంది . అంతేకాకుండా ఇతర దేశాలకు సంబంధించిన కంపెనీలను కూడా తమ దేశంలోకి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే భారత్తో ప్రస్తుతం ఆయిల్ కంట్రీస్ లో ఒకటైన దుబాయ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తద్వారా దుబాయ్కి చెందిన వారు భారత్ కి.. భారత్కు చెందిన వారు దుబాయ్ లో ఎంతో స్వేచ్ఛాయుత వాతావరణంలో వ్యాపారం చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇక దీనికి సంబంధించి త్వరలో ఒప్పందం పై సంతకాలు జరుగబోతున్నట్లు తెలుస్తోంది.