అక్కడ కాంగ్రెస్ నేతలే లేరంట.. కారణమేంటో..!

MOHAN BABU
 అక్కడ కాంగ్రెస్ పార్టీకి నేతలు కరువు. చెప్పుకోవడానికి కొంత కేడర్ ఉన్నా లీడర్లే లేరు. మరి రాష్ట్ర స్థాయి నాయకులే పట్టించుకోవాలా..? ఒకప్పుడు పార్టీకి గట్టి పట్టున్న నియోజకవర్గంలో కాంగ్రెస్ కు ఎందుకు ఈ దుస్థితి. సిర్పూర్ తెలంగాణ లో సంఖ్యాపరంగా  నెంబర్ వన్ నియోజకవర్గం. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ బలమైన నాయకత్వం ఉండేది. తర్వాత నాయకులు పలు పార్టీలలోకి జంప్ కావడం, ఉన్న వాళ్లకు ప్రాధాన్యం లేకపోవడంతో ఎవరికి వారు సర్దుకున్నారు. దీంతో సిర్పూర్ లో అధికార టీఆర్ఎస్ బలం పుంజుకుంది.ఇప్పుడు రాష్ట్రంలో తిరిగి పుంజుకోవాలి అని కాంగ్రెస్ భావిస్తోంది.

119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పరిస్థితిని మార్చేందుకు పిసిసి ప్రత్యేక ప్రణాళికలు రచిస్తోంది. అయితే ఆ 119 లో ఈ నియోజకవర్గం ఉందో లేదో పార్టీ క్యాడర్ కే డౌట్ ఉందట. ఆమధ్య పార్టీ సీనియర్లు హనుమంతరావు, రాములు నాయక్ తదితరులువచ్చి పార్టీ తో భేటీ నిర్వహించారు. వారు వచ్చింది కాంగ్రెస్ సభ్యత్వ నమోదుపై. అంటే రాష్ట్ర స్థాయి నాయకులు వస్తే కానీ  పార్టీ సభ్యత్వాన్ని ఇక్కడ ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదు. గతంలో కాంగ్రెస్, టిఆర్ఎస్ నువ్వా నేనా అన్నట్లు పోరాడే నియోజకవర్గంలో ప్రస్తుతం అధికార పార్టీ ఒక్కటే పెత్తనం చెలాయిస్తోంది. మిగతా పార్టీల ఉనికే కరువైంది. పొటీ ఇవ్వడం మాటేమో కానీ, కనీసం గొంతు చించుకొని మాట్లాడటానికి కూడా కాంగ్రెస్ నాయకులు లేరు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న కోనేరు కోనప్ప తర్వాతి కాలంలో బీఎస్పీలో చేరి ఎమ్మెల్యే అయ్యారు. అక్కడినుంచి టిఆర్ఎస్ కండువా కప్పుకొని నియోజకవర్గంలో పూర్తిస్థాయి పట్టు సాధించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి బరిలో దిగిన హరీష్ రావు ప్రచారం ఊదరగొట్టిన కోనప్ప ముందు నిలువలేక పోయారు. ఇప్పుడు ఆ హరీష్ రావు కూడా  కాంగ్రెస్ లో లేరు. బిజెపి లోకి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి దిక్కు లేకుండా పోయింది కాంగ్రెస్ పార్టీ. ప్రస్తుతం కొత్త నాయకున్ని వెతికే పనిలో ఉంది టిపిసిసి.

ఒక నేత ను తయారు చేయడం, జనాలకు పరిచయం చేయడం పెద్ద సవాల్. ఆ క్రమంలోనే  రాష్ట్ర స్థాయి నాయకులు తరచూ ఇక్కడికి వస్తున్న ఏం తేల్చ లేని పరిస్థితి ఉంది. వచ్చే ఎన్నికలకు ఒక అభ్యర్థిని నిలబెట్టాలి. ఉన్న కేడర్ ను కాపాడుకోవడం కూడా  ఇబ్బందిగా మారిందట. అయితే పొరుగు జిల్లాలో పోటీ చేయడానికి నియోజకవర్గాలు లేని కొందరు నాయకులు కన్నేస్తున్నట్లు  చూస్తున్న వారు ఎంతవరకు నెగ్గుకస్తారు అన్నదే ప్రశ్న. పీసీసీ ప్లాన్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: