యూపీ అసెంబ్లీ ఎన్నికలను షెడ్యూల్ ఖరారు ?

Veldandi Saikiran
ఢిల్లీః యుపి అసెంబ్లీ ఎన్నికలను షెడ్యూల్ ప్రకారమే  నిర్వహించాలని అన్ని పార్టీలు కోరుతున్నాయని ప్రకటన చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. త్వరలో జారీ కానున్న సవివరమైన మార్గదర్శకాలు చేస్తామని పేర్కొంది  కేంద్ర ఎన్నికల సంఘం.  యుపితో పాటు, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్, గుజరాత్  అసెంబ్లీలకు కూడా  వచ్చే ఏడాది మధ్య కల్లా జరగనున్నాయి ఎన్నికలు.  ఆరు రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణ కు సమాయత్తమౌతున్న కేంద్ర ఎన్నికల సంఘం...  పెద్ద సంఖ్యలో ఓటుహక్కును వినియోగించుకునే విధంగా మహిళలను ప్రోత్సాహించేందుకు ప్రత్యేకంగా 800 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది.  

ప్రతి ఓటరు ఓటింగ్ లో పాల్గొనేవిధంగా పెద్ద ఎత్తున చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది  కేంద్ర ఎన్నికల సంఘం. యుపి లో జరిగిన గత రెండు ఎన్నికల్లోనూ ఓటింగ్‌ ప్రక్రియ లో చాలా తక్కువ సంఖ్యలో ఓటర్లు పాల్గొనడాన్ని తీవ్రంగా పరిగణనిస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం...   “కోవిడ్” మార్గదర్శకాల్లో భాగంగా ఓటర్లు “భౌతిక దూరం” పాటించేందుకు అనుకూలంగా  మరో 11 వేల బూతులు ( పోలింగ్ కేంద్రాలు)  అదనంగా ఏర్పాటు చేయాలని  కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.  ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో కనీసం ఒక్కసారి అయునా ప్రతి ఒక్కరూ “వాక్సిన్” తీసుకుని ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది  కేంద్ర ఎన్నికల సంఘం.  

“ఫ్రంట్ లైన్” ఎన్నికల సిబ్బంది  ( ఎన్నికల నిర్వహణ లో భాగస్వాములుగా ఉండే ఉద్యాగులు) పూర్తిగా “వ్సాక్సిన్” తీసుకోవాలని నిర్దేశం చేసింది  కేంద్ర ఎన్నికల సంఘం. అలహాబాదు హైకోర్టు విజ్ఞప్తి మేరకు, ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర నేతృత్వంలో యుపి లో  పర్యటించిన కేంద్ర ఎన్నికల సంఘం బృందం...   అధికార బిజేపి, యుపి లో  ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న సమాజవాది పార్టీ, కాంగ్రెస్, బహుజన సమాజ్ పార్టీ తదితర ( బి.ఎస్.పి) పార్టీలన్నీ షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని కోరినట్లు  ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: