అక్కడంతా పర్ప్యూమ్ కంపు


ఆ ప్రాంతం తోళ్ల వ్యాపారానికి ప్రసిద్ధి చెందినది. భారత్ లో అత్యధిక జనాభా కల్గిన నగరాల్లో పన్నెండవ స్థానంలో ఉన్న నగరం ప్రస్తుతం నిత్యం వార్తల్లోకి ఎక్కుతోంది. అక్కడి అత్తరు గబ్బు కొడుతోంది. సుగంధ పరిమళాలు వేదజల్లాల్సిన పర్ఫ్యూమ్ రాజకీయపుు కంపు కొడుతోంది.
కాన్పూర్ నగరానికి చాలా ప్రత్యేకతలున్నాయి. 1857 నాటి ప్రథమ స్వాతంత్య్ర పోరాటంలో కాన్పూర్ నగరం ప్రధాన భూమిక పోషించింది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఎన్నికలకు సమాయత్తం అవుతున్న వేళ... ప్రతి నిత్యం ఎన్నికలకు  సంబందించి వార్తలు హల్ చల్ చేయడం రివాజు. అయితే గడచిన వారం పదిరోజులుగా అక్కడ ఆర్థిక సంబంధ నేరాలతో కూడిన వార్తలు ట్రోల్ అవుతున్నాయి. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో పన్ను ఎగవేత దారులపై  అధికారులు వరుస వెంబడి తనిఖీలు చేస్తున్నారు. మరో మూడు మాసాల్లో (మార్చి నెలాఖరు నాటికి ) ఆర్థిక సంవత్సరం పూర్తి కానుండటంతో టార్గెట్ లను పూర్తి చేసేందుకు ఆర్థిక శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అధికారులు ఇప్పటికే పియూష్ జైన్ నివాసస్థలంలో తనిఖీలు నిర్వహించగా వారికి విస్తుపోయో వాస్తవాలు వెలుగు చూశాయి. అత్యంత భారీ మొత్తంలో నగదు లభ్యమైంది . దీంతో యావత్ భారతావని నివ్వెర పోయింది. తనిఖీలను ముమ్మరం చేసిన అదికారులు  సమాజ్ వాదీ మద్దతు దారులు కావడంతో సహజంగానే ఆ పార్టీ మింగలేక , కక్కలేక అన్న ధోరణితో వ్యవహరిస్తోంది.  ప్రస్తుతం అధికారులు సమాజ్ వాదీ పార్టీకి మద్దతు దారుగు ఉన్న మరో వ్యాపారిపై దాడులు నిర్వహిస్తున్నారు. ఈ వ్యాపారి పైరు పుష్పరాజ్ అలియాస్ పంపి జైన్ గా వార్తల్లో ప్రచారంలో ఉంది. మరోసారి తమ పార్టీ సానుభూతి పరులపై దాడులు జరుగుతుండతో  సమాజ్ వాదీ పార్టీ నేతలు  తాజాగా  స్పందించారు. భారతీయ జనతా పార్టీకి  ఎన్నికల భయం పట్టుకుందని,  ప్రతిపక్ష పార్టీ నేతల ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. కళ్ల ముందు ఓటమి స్పష్టంగా కనిపిస్తుంటే దిక్కుతోచని స్థితిలో భారతీయజనతా పార్టీ నేతలున్నారని సమాజ్ వాదీ పార్టీ విమర్శించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: