తెలంగాణలో 2382 రేప్ కేసులు నమోదు ?

Veldandi Saikiran
ఈ ఏడాదిలో 98 మంది మావోయిస్టులను అరెస్ట్ చేసినట్లు డీజీపీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు.  అలాగే... 133 మంది మావోయిస్టులు సరెండర్  అయ్యారని..  మావోయిస్టులకు పోలీసులకు జరిగిన ఎన్కౌంటర్ లో 6 గురు నక్సల్స్ మృతి చెందినట్లు డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.  3 సార్లు మావోలకు పోలీసులకు ఎదురుకాల్పులు జరిగాయని..  97 శాతం మంది పోలీసులకు వ్యాక్సిన్ పూర్తి అయిందన్నారు.  తెలంగాణలో 4.6 శాతం క్రైమ్ రేట్ పెరిగిందని..  50 శాతం మంది నేరస్తులకు శిక్ష ఖరారు చేసినట్లు వివరించారు.  సిసి కెమెరాల ద్వారా 22781 కేసులు ఛేదన అయినట్లు... రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షలకు పైగా సిసి కెమెరాల ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు.  రాష్ట్ర వ్యాప్తంగా 664 నేరస్తులకు పిడి యాక్ట్ నమోదు అయ్యాయని... షి టీమ్స్ 5145 ఫిర్యాదులకు గాను 534 fir లు నమోదయని చెప్పారు.

 
ఈఏడాది లక్ష 32వేల 906 fir లు నమోదు అయినట్లు.. ఈ ఏడాది 3993 కొత్త సిబ్బంది నియామకం అయినట్లు డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. అలాగే.. 838 జీరో fir లు నమోదు అయ్యాయని..  గత ఏడాది 517 జీరో fir లు నమోదు అయ్యాయన్నారు.  రాష్ట్రంలో 838 హత్యలు జరిగాయని.. 2382 రేప్ కేసులు నమోదు నమోదు అయినట్లు డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. 1218 కిడ్నాప్ కేసులు, 16956 మిస్సింగ్ కేసులు నమోదయ్యాయని చెప్పారు.  16 రేప్ కేసులో 25మంది నేరస్తులకు శిక్ష ఖరారైనట్లు... 1233 ndps కేసులు నమోదు అయినట్లు చెప్పారు డీజీపీ మహేందర్ రెడ్డి. 34వేల కేజీల గంజాయి స్వాదీనం అయినట్లు... 2753 నేరస్తులు ndps యాక్ట్ కింద అరెస్ట్  అయినట్లు చెప్పారు డీజీపీ మహేందర్ రెడ్డి.  125 డ్రగ్స్ పెడలర్లపై పిడి యాక్ట్ నమోదు అయ్యాయని... ఎస్సి, ఎస్టీ కేసులు 1870 నమోదు చేసినట్లు వివరించారు.  2014 నుండి 2021 వరకు ఎస్సి ఎస్టీ 15758 కేస్ లలో బాధితులకు 99కోట్ల పరిహారం అందించడం జరిగిందని..  మహిళలపై వేధింపులు 17058 కేసులు నమోదు నమోదైనట్లు చెప్పారు.  160 వరకట్న వేధింపుల మరణాలు, 33 వరకట్న హత్యలు జరిగినట్లు చెప్పారు.  కట్నం కోసం వేధింపులు 8429 కేసులు నమోదయ్యాని.. ఈ ఏడాది 199 మహిళలు హత్యకు గురయ్యారన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: