కన్నా సైలెంట్‌గా సెట్ చేసుకుంటున్నారా?
కానీ బీజేపీలో చేరడం వల్ల రాజకీయంగా ఇబ్బందులు పడుతున్నారు. అధ్యక్ష పదవి ఉన్నంత కాలం పార్టీలో బాగానే పనిచేశారు. పదవి పోయాక మాత్రం యాక్టివ్‌గా పనిచేయడం లేదు. ఏదో అప్పుడప్పుడు మాత్రమే బీజేపీలో మెరుస్తున్నారు. ఇక ఈ మధ్య కాస్త దూకుడుగానే ఉంటున్నారు. ఇలా బీజేపీలో పనిచేస్తున్న కన్నా...తన పోలిటికల్ ఫ్యూచర్‌పై కీలక నిర్ణయాలు తీసుకోవడానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది.
ఎందుకంటే బీజేపీలో ఉంటే రాజకీయంగా సెట్ అవ్వడం చాలా కష్టం. పైగా ఏపీలో బీజేపీకి ఏ మాత్రం బలం లేదు. కాకపోతే నెక్స్ట్ గానీ టీడీపీతో పొత్తు ఉంటే బీజేపీకి కొన్ని సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ పొత్తు ఉండేలా కనిపించడం లేదు. అయితే టీడీపీ-జనసేనల పొత్తు ఫిక్స్ అయ్యేలా ఉంది. అదే జరిగితే కన్నా బీజేపీని వదలడం ఖాయమని తెలుస్తోంది. అప్పుడు జనసేనలోకి వెళ్ళి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. పొత్తులో భాగంగా గుంటూరు వెస్ట్ సీటు దక్కించుకుంటే కన్నాకు గెలుపు ఈజీనే. ఇప్పుడు ఆ దిశగానే కన్నా ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆయన కాపు నేతల సమావేశంలో పాల్గొన్నారు. ఈ పరిస్తితులని బట్టి చూసుకుంటే కన్నా...జనసేన వైపు వెళ్ళే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మరి చూడాలి కన్నా పోలిటికల్ కెరీర్ ఎలా ఉంటుందో?