హ్యాపీ న్యూ ఇయర్ : కొత్త ఆశలు.. సరికొత్త ఆశయాలతో..!

NAGARJUNA NAKKA
కొత్త సంవత్సరం వచ్చిందంటే చాలు.. కొత్త ఆశలు, సరికొత్త ఆశయాలు చిగురిస్తాయి. మదిలో ఏదో మనకు తెలియని కొత్త అనుభూతి కలుగుతుంది. గతాన్ని మరిచిపోతూ కొత్తగా జీవితాన్ని ప్రారంభించాలనే కాంక్ష మొదలవుతుంది. కరోనాతో 2021కూడా అత్యంత విషాద సంవత్సరంగా మిగిలిపోయింది. గతేడాది గాయాలను, చేదు జ్ఞాపకాలను ఓ పీడకలగా మరిచిపోదాం.. ఈ ఏడాది అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. 2022కి ఘన స్వాగతం పలుకుదాం.
ప్రతీ ఒక్కరికీ ఓ లక్ష్యం ఉండాలి. లక్ష్యం లేని జీవితం వృథానే. మన జీవితంలో ఏదైనా సాధించాలి అనే లక్ష్యం ఉంటే.. మనం అందుకోసం కసిగా పనిచేస్తాం. అలా కాకుండా అయ్యేదేదో అవుతుందిలే అనుకుంటే విలువైన సమయాన్ని వృథా చేసుకున్నట్టు అవుతాం. ఉద్యోగం పొందడం, కోర్సు పూర్తి చేయడం, అధిక బరువు తగ్గడం ఇలా ఏదైనా ఒక లక్ష్యాన్ని నిర్ధేశించుకోండి. దాన్ని చేధించి విజేతగా నిలవండి.
నిత్య విద్యార్థిగా ఉన్నప్పుడు మన జ్ఞానం పెరుగుతుంది. ప్రస్తుతం చాలా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ లో కోర్సులు నేర్చుకొని మీ స్కిల్స్ పెంచుకోండి. ఉద్యోగులు, విద్యార్థులు, నిరుద్యోగులు, గృహిణులు.. ఇలా మీరు ఎవరైనా సరే స్కిల్స్ పెంచుకోవడాన్ని రెజల్యూషన్ గా తీసుకొని ఎప్పుడూ ఏదో కొత్త విషయం తెలుసుకోండి. కొత్త భాష నేర్చుకోవడం కూడా మన స్కిల్స్ అప్ డేట్ చేసుకోవడం కిందకు వస్తుంది.
జీవితంలో కలిసే కొత్త వ్యక్తులు, చేసే కొత్త ప్రయాణాలు మనకు ఎన్నో అనుభూతులతో పాటు ఎన్నో అనుభవాలను ఇస్తాయి. ఈ ఏడాది కోవిడ్ తో అంతా ఇంటికే పరిమితం అయ్యాము. కానీ అంతా బాగుంటే అన్ని జాగ్రత్తలు పాటిస్తూ పర్యటనలు ప్లాన్ చేసుకోవాలి. ఈ టూర్లు పుణ్యక్షేత్రాలైనా.. కావొచ్చు. ప్రకృతి నెలవులైనా కావొచ్చు. ఎక్కడికైనా వెళ్లేందుక ప్లాన్ చేయాలి. వీటితో జీవితంలో కొత్త రోజులను, ఎన్నోజ్ఞాపకాలను సొంతం చేసుకుంటారు. అందరికీ ఆల్ ది బెస్ట్ హ్యాపీ న్యూ ఇయర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: