"ఒమిక్రాన్" ఎఫెక్ట్: యోధులారా భయపడకండి...

VAMSI
కొత్త సంవత్సరం రోజున అందరూ ఎంతో సంతోషంగా ఉంటారని ఆశిస్తున్నాము. ఈ సంవత్సరం అందరికీ ఆరోగ్యం, సంపద కలిగి ఉండాలని మా ఇండియా హెరాల్డ్ ద్వారా కోరుకుంటున్నాము. చూస్తూ ఉండగానే సంవత్సర కాలం ఇలా గడిచిపోయింది. ఈ 2022 సంవత్సరంలో అయినా ఎటువంటి వైరస్ లు కానీ, తుఫాన్ లు కానీ, భూకంపాలు కానీ మానవజాతిని హరించకుండా ఉండాలని ఆ భగవంతుని ప్రార్ధిద్దాం. ప్రకృతి వైఫరీత్యాలను ఎవ్వరూ ఆపలేము. కానీ వాటికన్నా కూడా ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఏకైక వైరస్ కరోనా మహమ్మారి. గత రెండు సంవత్సరాల నుండి ప్రతి ఒక్కరూ దీని బారి నుండి బయటపడడానికి పోరాడుతూనే ఉన్నారు.

అయితే కొందరు తమ శక్తికి మించి పోరాడి తన చేతిలో వీర మరణం పొందారు. దీనిని రూపు మాపడానికి వాక్సిన్ లు పుట్టుకొచ్చినా కరోనా తన రూపాన్ని మార్చుకుంటూ ఎప్పటికప్పుడు బయటకు వస్తోంది. గతంలో కరోనాగా మొదలై ఆ తర్వాత డెల్టా, ఆ తర్వాత ఇప్పుడు ఒమిక్రాన్ అంటూ మానవజాతిని భయకంపితులను చేస్తోంది. ఇప్పుడిప్పుడే ఈ ఒమిక్రాన్ ప్రమాదంగా మారుతోంది. ఈ విషయం పట్ల ప్రభుత్వాలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నా లేకున్నా... మనము వ్యక్తిగతంగా తీసుకోవలసిన జాగ్రత్తల పట్ల అప్రమతంగా ఉండడం చాలా ముఖ్యం అని గుర్తించాలి.

* ముందుగా మీరు ఒమిక్రాన్ గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోకండి.

* కరోనా యొక్క మూడవ రూపమే ఈ ఒమిక్రాన్.. అంతకు మించి ఏమీ లేదు. అవసరం అయితే తప్ప బయటకు వెళ్లకండి.

* ఒకవేళ బయటకు వెళ్లినా కరోనా నిబంధనలను పాటించండి. మాస్క్ లేకుండా బ్యాటకు వెళ్లడం చాలా ప్రమాదం. అలాగే శానిటైజర్ ను వాడండి, వీలైనంత వరకు సామాజిక దూరం పాటించండి.

* మీలో కరోనా పట్ల ఉన్న భయాన్ని వదిలేయండి. దైర్యంగా ఉండండి. మీరు పిరికితనంగా ఉంటే అది మిమ్మల్ని ఇంకా భయపెడుతుంది .

మనము అన్ని వైరస్ ల కన్నా యమ డేంజర్.. మనల్ని చూసి ఆ వైరస్ లే భయపడి పారిపోవాలి. అందరూ ఒమిక్రాన్ పై యుద్దానికి యోధులులాగా సిద్ధంగా ఉండండి.

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: