ఒమిక్రాన్ ఎఫెక్ట్: పిల్లల కేసులపై స్పెషల్ ఫోకస్...
అగ్ర రాజ్యాలు అయిన అమెరికా మరియు ఫ్రాన్స్ దేశాలలో సైతం కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు అప్రమత్తం కావాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ నిన్న లేఖ రాయడం జరిగింది. గతంలో లాగా హాస్పిటల్స్ లో అవసరం అయిన అన్ని వనరులను సమకూర్చుకోవాలని మరొక్కసారి గుర్తు చేశారు. మొదటి మరియు రెండవ వేవ్ లో హాస్పిటల్స్ లో సరైన వసతులు లేక రోగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అందుకే ఈ సారి ముందస్తుగా దేశ వ్యాప్తంగా అన్ని హాస్పిటల్స్ లో బెడ్స్, టెంపరరీ హాస్పిటల్స్, ఐ సి యూ, ఆక్సిజన్, అంబులెన్స్, మెడిసిన్స్, స్టాఫ్ మరియు కాల్ సెంటర్ లాంటి ఎన్నో సౌకర్యాలను అమర్చుకోమని కేంద్రం రాష్ట్రాలకు తెలిపింది.
ఈ లేఖలో మరొక విషయాన్ని ప్రధానమైనదిగా తెలిపింది. పిల్లల కేసులలో కూడా మార్పులు వస్తున్న తరుణంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచన చేసింది. ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకుంటూ కరోనాను రూపు మాపాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు తెలిపింది. మరి చూద్దాం ఈ సంవత్సరం అయినా కరోనా వలన మానవాళికి ఎటువంటి నష్టం జరగకుండా ఉండాలని ఆశిద్దాం.