అక్కడ టీడీపీ గెలుపును ఎవ్వరూ ఆపలేరా...!
కాకపోతే వైసీపీ అధికారంలో ఉండటం వల్ల..ఆ పార్టీకి ఉన్న అధికార బలం వల్ల నియోజకవర్గంలో ఆధిక్యం ఉన్నట్లు కనిపిస్తోంది. పైగా లోకల్ ఎన్నికల్లో కొండపిలో వైసీపీ సత్తా చాటింది. అయితే ఈ విజయాలు పూర్తిగా అధికార బలంతోనే వచ్చాయని చెప్పొచ్చు. అలా అని ఇక్కడ టీడీపీ బలం పూర్తిగా తగ్గినట్లు కనిపించడం లేదు. అలాగే ప్రతిపక్షంలో ఉన్నా సరే ఎమ్మెల్యే డోలా ప్రజల్లోనే ఉంటూ, వారి కోసం పనిచేస్తున్నారు. అనుకున్న మేర పనులు చేయకపోయిన సరే, ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు.
ఇటు వైసీపీ నేత మాదాసి వెంకయ్య...అధికారం ఉండటంతో నియోజకవర్గంలో పెత్తనం చేస్తున్నారు. ఆయన ప్రజలని పూర్తిగా మెప్పించడంలో విఫలమవుతున్నట్లే కన్పిస్తోంది. దీంతో కొండపిలో వైసీపీకి ఏ మాత్రం పట్టు చిక్కుతున్నట్లు కనిపించడం లేదు. పైగా వచ్చే ఎన్నికల్లో కొండపి సీటు ఎవరికి దక్కుతుందనేది క్లారిటీ లేదు. అక్కడ ముగ్గురు నలుగురు నేతలు రేసులో ఉన్నారు.
ఎందుకంటే కొండపి సీటు కోసం జూపూడి ప్రభాకర్ కూడా ట్రై చేస్తున్నారు. ఇక సీటు ఎవరికి దక్కిన మరొకరు సహకరించే పరిస్తితి లేదు. వీటికి తోడు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీపై వ్యతిరేకత పెరుగుతూ వస్తుంది. ఈ పరిణామం కూడా కొండపిలో వైసీపీకి ఇబ్బంది అవుతుంది. అంటే కొండపిలో మరోసారి టీడీపీకి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.