టి.ఎం.సికి త్రిపురలో చెక్ !.. కారణం ఇదే
ప్రధాని పగ్గాలు చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్న తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి త్రిపుర లో చెక్ పడింది. ఇది తాత్కాలికమా, శాశ్వతమా అన్న విషయం కాస్త పక్కన పెడదాం. ఇంతకీ అసలు అక్కడ ఏం జరిగింది ? టి.ఎం.సికి చెక్ చెప్పింది ఎవరు ? కారణం ఎంటి ? జస్ట్ ఎ లుక్..
తృణముల్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మమతా బెనర్జీకి దగ్గరి బంధవు అభిషేక్ బెనర్జీ. ఈయన పార్లమెంట్ సభ్యుడు కూడా. ఆ పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించే కీలక నేత. ఆయన త్రిపుర పర్యటనను ఆ రాష్ట్ర ప్రభుత్వం అడ్డు చెప్పింది. ఆయన అగర్తలకు సమీపుంలోని బారామురా ఎకో పార్కును సందర్శించాల్సి ఉంది. ఆయన పర్యటనకు స్థానికంగా ఉండే తృణముల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఏర్పాట్లు కూడా చేశారు. అయితే స్థానిక పోలీసులు మాత్రం ముందస్తు పర్మిషన్ తీసుకోలేదని పేర్కోంటూ అభిషేక్ బెనర్జీ పర్యటనకు చెక్ చెప్పారు. ఇదే విషయాన్ని అభిషేక్ బెనర్జీకి లేఖ ద్వారా తెలిపారు. మీరు పర్మిషన్ కోరిన సమయాని కంటే ముందుగానే ఆ ప్రాంతంలో రాష్ట్ర మంత్రి పర్యటన ఖరారైందని, శాంతిభద్రతల దృష్ట్యా మీ పర్యటనకు అనుమతి ఇవ్వడం లేదని అదికారులు ఆ లేఖ లో వివరించారు.
దీంతో అభిషేక్ బెనర్జీ తనదైన రీతిలో త్రిపుర అధికార యంత్రాంగానికి సున్నితంగా నే ఘాటైన సమాధానం ఇచ్చారు. మమ్మల్ని చూసి మీ రెందుకు భయపడుతున్నారు ? అని సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నించారు. మా పర్యటనలను అడ్డుకోగలరేమో కానీ, ప్రజల్లో తృణముల్ కాంగ్రెస్ పై పెరుగుతున్న అభీమానాన్ని మాత్రం అడ్డుకో లేరు అని అభిషేక్ పేర్కోన్నారు. పశ్చిమ బెంగాల్ లో భారతీ జనతా పార్టీ ప్రభావం క్రమంగా కోల్పోతోందని, ఇదే విషయం ఇటీవలి కోల్ కత్తామున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో తేటతెల్లమైందని ఆయన తెలిపారు. దేశంలో ప్రస్తుతం బారతీయ జనతా పార్టీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, ఆ గాలుల ఉధృతిలో ఆ పార్టీ కొట్టుకుపోవడం ఖాయమని కూడా అభిషేక్ పేర్కోన్నారు. ప్రజలకు మేలు చేసి, వారి మనస్సులను గెల్చుకునే బదులు బిజేపి ఎదుటి పక్షాలను ఇబ్బందులు పెట్టడం పైనే దృష్టి పెట్టడం దారుణమని అన్నారు. అగర్తల లో అభిషేక్ బెనర్జీ రాజకీయేతర గిరిజనుల సదస్సులో పాల్గోనాల్సి ఉంది. వివిధ రంగాలలో ప్రతిభ కనబర్చిన గిరిజనులను సన్మానించాల్సి ఉంది. కానీ త్రిపుర ప్రభుత్వం టిఎంసికి చెక్ చెప్పడం తో ఆ కార్యక్రమం వాయిదా పడింది.