రాయలసీమ : జగన్ ఫోకస్ పెట్టకపోతే కష్టమేనా ?
అర్జంటుగా జగన్మోహన్ రెడ్డి దృష్టిపెట్టాల్సిన నియోజకవర్గం జిల్లాలో మరొకటి తయారైంది. ఇప్పటికే నగిరి నియోజకవకర్గంలో ఎంఎల్ఏకి కొందరు నేతలకు మధ్య వివాదం తారస్ధాయికి చేరుకున్నది. తాజాగా రెండో నియోజకవర్గం తంబళ్ళపల్లి కూడా నగిరి దారిలోనే వెళుతోంది. ఎంఎల్ఏ పెద్దిరెడ్డి ద్వారకనాదరెడ్డికి తంబళ్ళపల్లి జడ్పీటీసీ సభ్యురాలు గీత దంపదులకు పెద్ద గొడవే జరుగుతోంది. తనను విమర్శించారన్న కారణంతోనే ఎప్పటిదో కేసులను బయటకు తీసి గీత భర్త కొండ్రెడ్డిని ఎంఎల్ఏ అరెస్టు చేయించారనే ఆరోపణలు పార్టీలో సంచలనంగా మారింది.
తన భర్తను అక్రమ కేసుల్లో ఇరికించి అరెస్టు చేయించారంటు గీత బహిరంగంగానే ఎంఎల్ఏపై ఆరోపణలు చేయటం పార్టీలో కలకలం రేపుతోంది. అరెస్టు చేసిన భర్తను ఎక్కడికి తరలించారో కూడా తనకు తెలియదని, ఎవరిని అడిగినా చెప్పటం లేదని గీతా నానా గోల చేస్తున్నారు. గీత+కొండ్రెడ్డితో మొదలైన గొడవలు ఎక్కడికి దారితీస్తుందో తెలీదు. తన భర్తను అరెస్టు చేయించిన తర్వాత జడ్పీటీసీ సభ్యురాలు ఎంఎల్ఏ సర్దుబాటు చేసుకుంటారని ఎవరు అనుకోవటంలేదు.
ఇప్పటికే నగిరిలో ఎంఎల్ఏ రోజాతో కొందరు నేతలకు గొడవవుతున్న విషయం తెలిసిందే. రోజాకు పార్టీలోనే బలమైన ప్రత్యర్ధి వర్గం తయారైంది. రేపటి ఎన్నికల్లో ప్రత్యర్ధి వర్గం సహకారం లేకపోతే రోజా గెలుపు కష్టమే. టికెట్ ఇచ్చేది జగనే అయినా క్షేత్రస్ధాయిలో పనిచేయాల్సింది ద్వితీయ శ్రేణి నేతలే అన్న విషయం రోజా మరచిపోయినట్లున్నారు. అందుకనే బస్తీమే సవాల్ అన్నట్లుగా తన ప్రత్యర్ధివర్గంతో గొడవలు పడుతున్నారు. చివరకు వీళ్ళమధ్య గొడవలు పెరిగిపోయి పోలీసుల దగ్గర ఫిర్యాదు దాకా వ్యవహారం వెళ్ళింది.
పార్టీ నేతల మధ్య మొదలైన గొడవలు నగిరితో మొదలై తంబళ్ళపల్లి దాక పాకింది. మొన్నటి ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబునాయుడు మాత్రమే గెలిచారు. మిగిలిన 13 నియోజకవర్గాల్లోను వైసీపీ నేతలే గెలిచారు. ఇంతటి మెజారిటి వచ్చిన జిల్లాలో ఒక్కో నియోజకవర్గంలో గొడవలు పెరిగిపోతున్నాయి. గొడవలకు ఎవరు కారణం అనేది పక్కన పెడితే ఆధిపత్య గొడవలు జరుగుతున్నది వాస్తవం. జగన్ వెంటనే దృష్టి పెట్టకపోతే రేపు ఇంకే నియోజకవర్గంలో మొదలవుతాయో ?