ట్రోలింగ్ పాయింట్ : ఆ జిల్లాలకు పింఛనే లేదు..దిస్ ఈజ్ వాస్తవం!

RATNA KISHORE
గ‌త ప్ర‌భుత్వంలో పింఛ‌న్లు అందుకున్న వారు 35 ల‌క్ష‌లు
వెచ్చించిన మొత్తం నాలుగు వంద‌ల కోట్లు
మా ప్ర‌భుత్వంలో పింఛ‌న్లు అందుకున్న వారు అర‌వై రెండు ల‌క్ష‌లు
వెచ్చించిన మొత్తం ప‌దిహేను వంద‌ల కోట్ల‌కు పైగా ..
అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి ఇప్ప‌టిదాకా
పింఛ‌న్ల కోసం వెచ్చించిన మొత్తం న‌ల‌భై ఐదు వేల కోట్లు
- ఇదీ జ‌గ‌న్ ప్ర‌భుత్వం చెబుతున్న లెక్క
ఆధారం : ప్ర‌ముఖ ప‌త్రిక‌కు ఇచ్చిన ప్ర‌క‌ట‌న

 
సాంకేతిక లోపాలు కార‌ణంగా చాలా చోట్ల నిన్న‌టి వేళ పింఛ‌ను అంద‌లేద‌ని పైకి చెప్పుకుంటున్నా ఆఖ‌రికి తేలిందేంటంటే అస‌లు జ‌గ‌న్ స‌ర్కారు దగ్గ‌రే పైస‌లు లేవ‌ని! అందుకే ఒక‌టి కాదు రెండు కాదు ఏడు జిల్లాల‌లో పింఛ‌న్ల పంపిణీనే నిన్న‌టి వేళ జ‌ర‌గ‌లేద‌ని తేలిపోయింది.


క‌డ‌ప‌,కృష్ణా,విజ‌య‌న‌గ‌రం,చిత్తూరు,క‌ర్నూలు,గుంటూరు,ప్ర‌కాశం జిల్లాల‌తో స‌హా ఇంకా వివిధ ప్రాంతాల‌లో పింఛ‌న్లు అంద‌నేలేద‌ని ప్రాథ‌మిక స‌మాచారం.ఇవాళ కూడా పింఛ‌న్లు ఇవ్వ‌లేదని కొంద‌రు అర్హులు చెబుతున్నారు.


అన్ని పెద్ద పెద్ద మాట‌లు చెప్పాక మ‌నం విన్నాక అన్నీ నిజ‌మే అనుకుంటాం.అంతేకానీ అబ‌ద్ధం అని అస్స‌లు అనుకోం.అనుకోలేం కూడా!జ‌గ‌న్ కానీ ఆయ‌న మంత్రి వ‌ర్గ స‌హ‌చ‌రులు కానీ పెద్ద పెద్ద మాట‌లే చెబుతుంటారు.కానీ అవేవీ ఆచ‌ర‌ణ‌కు నోచుకోవు అని తెలుసుకున్నాక బాధ‌ప‌డ‌డం మిన‌హా మ‌న‌మేం చేయ‌లేం.తాజాగా పింఛ‌న్ల పెంపు అనంత‌రం వాటిని పంపిణీ చేయాల‌నుకుంటు న్న వైనం వీట‌న్నింటిపై నిన్న ఈనాడుకు ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చి ఎంతో గొప్ప ప్రచారం చేసుకున్నారు గౌర‌వ యువ‌ముఖ్య‌మంత్రి.


వాస్త‌వానికి మాత్రం ఇప్ప‌టికీ చాలా గ్రామాల‌లో అర్హుల‌కు పింఛ‌ను అంద‌లేదు.అర్హులు అయితే నిన్నంతా బ్యాంకుల ద‌గ్గ‌రే ప‌డి గాపులు కాశారు. ఇంత జ‌రిగినా కూడా మాది పేద‌ల ప్ర‌భుత్వం అని డ‌బ్బా కొట్ట‌డంలో వైసీపీనే టాప్ అని అంటోంది టీడీపీ. కొత్త ఏడాది కానుక‌గా రెండు వేల ఐదు వంద‌ల రూపాయ‌లు పింఛ‌ను (పెంచిన విధానం ప్ర‌కారం..ఇప్ప‌టిదాకా 2250 ఉండేది) వ‌స్తుం ద‌ని ఆశ‌గా ఎదురుచూసిన అవ్వాతాత‌ల‌కు నిరాశే మిగిలించి జ‌గ‌న్ అన్న‌య్య ఊరించి ఊరించి ఉస్సూరుమ‌నిపించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

ycp

సంబంధిత వార్తలు: