జోగికి సొంత పోరు..సెట్ చేయకపోతే కష్టమే!
అటు వెళితే నగరిలో ఎంత రచ్చ జరుగుతుందో తెలిసిందే. అలాగే చిలకలూరిపేట, నందికొట్కూరు, పాయకరావుపేట, కర్నూలు సిటీ, గూడూరు, తాడికొండ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు నడుస్తుంది. ఇక ఈ పోరు కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో కూడా జరుగుతుంది. పెడన ఎమ్మెల్యే జోగి రమేష్‌కు, వైసీపీ నేత ఉప్పాల రామ్‌ప్రసాద్ వర్గాలకు పెద్దగా పడదనే విషయం తెలిసిందే.
మొదట నుంచి వీరి ఇరువురుకు సీటు విషయంలో రచ్చ నడుస్తూనే ఉంది. అయితే ఇటీవల ఉప్పాల కోడలు హారికకు జెడ్పీ చైర్‌పర్సన్ పదవి ఇచ్చారు. దీంతో కాస్త పోరు తగ్గినట్లే కనిపించింది. కానీ ఆ మధ్య పెడన జెడ్పీటీసీ ఎన్నిక విషయంలో వీరి వర్గాల మధ్య రచ్చ నడిచిందని తెలిసింది. అభ్యర్ధి విషయంలో పెద్ద రచ్చే జరిగిందని సమాచారం. ఆ రచ్చ వల్లే పెడన జెడ్పీటీసీ స్థానంలో వైసీపీ ఓడిపోయింది. అయితే వచ్చే ఎన్నికల్లో కూడా ఈ ఆధిపత్య పోరు కొనసాగితే ఎమ్మెల్యే జోగి రమేష్‌కు పెద్ద తలనొప్పిగా మారే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా టీడీపీకి అడ్వాంటేజ్ అవుతుంది. పైగా టీడీపీతో జనసేన గెలిస్తే జోగికి గెలవడమే కష్టం అవుతుంది.