వైరస్ దెబ్బకు మళ్లీ లాక్ డౌన్..!
ఇక ఒమిక్రాన్ కట్టడికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. నేటి నుంచి విద్యాసంస్థలు, స్పాలు, సెలూన్లు, బ్యూటీ పార్లర్లు, జూలు, పార్కులు మూసివేస్తున్నట్టు తెలిపింది. ఇక ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీసులు 50శాతం సిబ్బందితోనే కార్యకలాపాలు సాగించాలంది. సమావేశాలు వర్చువల్ గా నిర్వహించుకోవాలని సీఎస్ హెచ్ కే ద్వివేది ఆదేశాల్లో పేర్కొన్నారు. అంతేకాదు ముంబై, ఢిల్లీకి విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించింది.
ఢిల్లీలో కరోనా పరిస్థితులను సీఎం కేసీఆర్ వివరించారు. కోవిడ్ కేసులు ఢిల్లీలో వేగంగా పెరుగుతున్నాయనీ.. అయితే ఆస్పత్రిలో చేరే వారి సంఖ్య మాత్రం తక్కువగా ఉందన్నారు. దీంతో భయపడనక్కర్లేదని భరోసానిచ్చారు. ఎక్కువ మంది బాధితుల్లో కరోనా లక్షణాలు కనిపించడం లేదన్నారు. కోవిడ్ రోగుల కోసం 246ఆస్పత్రుల్లో పడకలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. 37వేలకు పైగా ఆక్సిజన్ పడకలు అందుబాటులో ఉంచినట్టు చెప్పారు. సెకండ్ వేవ్ తో పోలిస్తే కోవిడ్ తీవ్రత తక్కువగా ఉందని చెప్పారు.
ఇక మహారాష్ట్రలో అయితే కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో అక్కడ 11వేల 877 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక తాజాగా 9మంది ప్రాణాలు కోల్పోయారు. 2వేల 69మంది కోవిడ్ నుంచి కోలుకోగా.. రాష్ట్రంలో ప్రస్తుతం 42వేల 24యాక్టివ్ కేసులున్నాయి. ఇక కొత్తగా 50 మందికి ఒమిక్రాన్ వేరియంట్ నిర్ధారణ కాగా.. రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 510కి చేరింది.