వైద్యులు షాక్.. స్మశానంలో శిశువు ప్రాణం?

praveen
సాధారణంగా ఒక్కసారి మనిషి ప్రాణం వదిలిన తర్వాత ఇక కుటుంబ సభ్యులు బంధువులు అందరూ కలిసి చనిపోయిన వ్యక్తికి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇక వారిని స్మశానవాటిక కు తీసుకు వెళుతూ ఉంటారు. శోకతప్త హృదయాలతో ఇక చనిపోయిన వారికి వీడ్కోలు పలుకుతూ ఉంటారు. అయితే ఇలా చనిపోయారు అనుకున్న వ్యక్తి ఇక స్మశానం లోకి వెళ్ళిన తర్వాత మాత్రం ఒక్కసారిగా కళ్లు తెరచి మాట్లాడితే అక్కడున్న వారందరూ మొదట కాస్త భయబ్రాంతులకు గురి అవుతారు. కానీ ఆ తర్వాత తమకు ప్రియమైన వారికి ప్రాణం వచ్చింది అని సంతోష పడి పోతూ ఉంటారు. ఇక ఇటీవల ఇలాంటి తరహా ఘటన ఒకటి జరిగింది అన్న విషయం తెలిసిందే.



 ఒక వృద్ధుడు మరణించాడు అని వైద్యులు నిర్ధారించడంతో అతనికి అంత్యక్రియలు నిర్వహించి స్మశాన వాటికకు తీసుకెళ్లారు ఇక చితిపై పడుకోబెట్టి నోట్లో గంగాజలం పోయగానే ఆ వృద్ధుడికి ప్రాణం వచ్చి మాట్లాడటం మొదలు పెట్టాడు. చితి పై ఏకంగా వృద్ధుడు లేచి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా ఘటన జరిగింది.. ప్రాణం లేకుండా పుట్టిన శిశువును ఖననం చేసేందుకు స్మశాన వాటికకు తీసుకెళ్లగా శిశువు ఒక్కసారిగా కళ్లు తెరిచి ఏడవడం మొదలు పెట్టింది. ఈ ఘటన తెలంగాణలోని గోదావరిఖని లో వెలుగులోకి వచ్చింది.



 సాధారణంగా శిశువు తొమ్మిది నెలల తర్వాత తల్లి గర్భం నుంచి బయటికి వస్తుంది. కానీ ఇక్కడ మాత్రం ఆరు నెలల 15 రోజులకే తల్లి గర్భం నుంచి బయటకు వచ్చింది. దీంతో ప్రాణం లేకుండానే పుట్టింది ఆ శిశువు. ఇక ఉలుకూ పలుకూ లేకపోవడంతో చనిపోయింది అనుకుని భావించారు తల్లిదండ్రులు. ఇక వైద్యులు కూడా శిశువుని తల్లిదండ్రులకు అప్పగించారు.. దీంతో శిశువుని స్మశానవాటికలో ఖననం చేసేందుకు వెళ్లారు. కానీ ఒక్కసారిగా శిశువు కళ్ళు తెరిచి ఏడవడం మొదలు పెట్టింది. దీంతో వెంటనే ఆ శిశువు ఆస్పత్రికి తరలించారు. ఇక ఇలా శిశువు ఒక్కసారిగా ప్రాణం పోసుకోవడం తో వైద్యులు సైతం ఆశ్చర్యపోయారు. ఇలా చనిపోయి బ్రతికి రావడం అంటూ చెబుతున్నారు వైద్యులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: