2021.. జ‌గ‌న్‌కు హ్యాపీనా.. అన్ హ్యాపీనా...?

VUYYURU SUBHASH
ఏపీలో వైసీపీ అధికారంలోకి వ‌చ్చి రెండున్న‌ర సంవ‌త్సరాలు గ‌డిచిపోయాయి. అయితే.. ఈ రెండున్న రేళ్ల‌లో తొలి అర్ధ‌భాగం బాగానే గ‌డిచిన‌ప్ప‌టికీ.. గ‌త ఏడాది క‌రోనాతో ఇబ్బందులు ప‌డాల్సి వ‌చ్చింది. ఇక‌, ఈ ఏడాది మాత్రం పాల‌న‌ప‌రంగా.. జ‌గ‌న్‌కు మంచి మార్కులు ప‌డ్డాయి. కేంద్రం నుంచి కితాబులు కూడా అందాయి. ఉత్త‌మ సీఎంల జాబితాలో సీఎం 4వ స్థానం ద‌క్కించుకున్నారు. అదేవిధంగా శాంతి భ‌ద్ర‌త‌ల ప‌రంగా కూడా.. మంచి మార్కులు ల‌భించాయి. ఇది జ‌గ‌న్ పాల‌నకు కేంద్రం ఇచ్చిన కితాబుగానే చెప్పాల్సి ఉంటుంది. ఇక‌, సంక్షేమ ప‌థ‌కాలను మ‌రింత వేగ‌వంతం చేశారు. ఈ ఏడాదిలోనే 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీల‌కు వైఎస్సార్ భ‌రోసా పేరిట పింఛ‌న్‌ను ప్రారంభించారు.

అదేవిధంగా ఈ ఏడాదిలోనే పేద‌లంద‌రికీ ఇళ్లు ప‌థ‌కాన్ని తీసుకువ‌చ్చి.. దాదాపు 30 ల‌క్ష‌ల మంది పేద‌ల‌కు ఇళ్ల స్థ‌లాలు కేటాయించారు. కొందరు కోర్టులో కేసు వేసి ఆపే ప్ర‌య‌త్నం చేసినా.. ప్ర‌భుత్వం పోరాడి విజ‌యం ద‌క్కించుకుంది. ఇక‌, ఓటీ ఎస్ ప‌థ‌కాన్నితీసుకువ‌చ్చి.. పేద‌లకు తాము నివ‌సిస్తున్న ఇళ్ల‌పై అధికారం ద‌క్కేలా చేసి..ఇ ప్ప‌టి వ‌రకు ఏ ముఖ్య‌మంత్రి తీసుకోని చ‌ర్య‌లు తీసుకుంది. ఇక‌, జ‌గ‌న‌న్న‌పాల‌వెల్లువ .. ఈ సంవ‌త్స‌రంలో ప్ర‌తి జిల్లాలోనూ ప్రారంభించారు. త‌ద్వారా పాడి ప‌రిశ్ర‌మ‌కు ప్ర‌భుత్వం అన్ని రూపాల్లోనూ చేయూతను అందించిన‌ట్టు అయింది. మ‌రోవైపు.. విద్యాదీవెన నిధుల‌ను త‌ల్లుల ఖాతాల్లో వేసేలా నిర్ణ‌యం తీసుకున్నారు.

ఇలా పాల‌న ప‌రంగా జ‌గ‌న్‌కు మంచి మార్కులు ప‌డ్డాయి. ఇక‌, పార్టీ ప‌రంగా చూసుకున్నా.. పార్టీలో నేత‌లు అంద‌రికీ సంపూర్ణ స్వేచ్ఛ‌ను ఇచ్చారు. అయితే.. హ‌ద్దు మీరిన నాయ‌కుల‌కు అలానే క్లాస్ ఇచ్చారు. వారిని లైన్‌లో పెట్టుకున్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల‌పై సీఎం జ‌గ‌న్ స్వ‌యంగా పోరాటం చేశారు. తిరుప‌తి ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన కేంద్రం హోం మంత్రి అమిత్ షాను ఈ విష‌యంలో ఆయ‌న నిల‌దీశారు. దీంతో కేంద్రం ఈ ఏడాదే చ‌ర్య‌లు ప్రారంభించింది. రాష్ట్రానికి విభ‌జ‌న హ‌క్కుల ప్ర‌కారం రావాల్సిన నిధుల‌పై చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఇది రాష్ట్రానికి మంచి ప‌రిణామంగా మారింది.

ఇక‌, పొరుగు రాష్ట్రాల‌తోనూ.. సీఎం జ‌గ‌న్ ఆచితూచి వ్య‌వ‌హ‌రించారు. పార్టీ ప్ర‌యోజ‌నాలు కాకుండా..రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కు ఆయ‌న పెద్ద పీట వేశారు. రాయ‌ల‌సీమ ఎత్తిపోతల ప్రాజెక్టు విష‌యంలో తెలంగాణ అభ్యంత‌రం చెప్ప‌డంపై.. సీఎం సీరియ‌స్ అయ్యారు. అంతేకాదు.. కాళేశ్వ‌రం అనుమ‌తుల‌పై గుట్టును బ‌య‌ట‌కు తీశారు. దీంతో ఆ ప్ర‌భుత్వం వెన‌క్కి త‌గ్గింది. ఇక‌, మూడు  రాజ‌ధానుల‌ను ముందుకు తీసుకువెళ్తామ‌ని ప్ర‌క‌టించారు.

అదేస‌మ‌యంలో ఒడిశాతో కొన్ని ద‌శాబ్దాలుగా ఉన్న కొఠియా గ్రామాల స‌మ‌స్య‌, వంశ‌ధార ప్రాజెక్టు, పోల‌వ‌రం ముంపు స‌మ‌స్య‌ల‌పై స్వ‌యంగా వెళ్లి ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేయ‌డం.. జ‌గ‌న్ ఇమేజ్‌ను మ‌రింత పెంచింది. మ‌రీ ముఖ్యంగా కేంద్రం నుంచి జ‌గ‌న్ స‌ర్కారుకు రెండు మూడు అంశాలు త‌ప్ప‌.. అన్నింటిలోనూ సాయం అందింది. ఇలా.. 2021 జ‌గ‌న్‌కు అన్ని రూపాల్లోనూ మేలు చేసింద‌నే చెప్పాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: