వావ్ వావ్ : ఆ ఈనాడు ఎడిటర్ కు జేజేలు ఎందుకంటే?
ఇప్పుడు డిజిటల్ వింగ్ ను కూడా బలోపేతం చేసే పనిలో ఉన్నారు కనుక ఆ సంస్థ నుంచి ఇంకొందరు మార్కెట్లోకి వచ్చే అవకాశాలున్నాయి.మంచి వార్త ఎవ్వరు రాసినా ఆనందించే వ్యక్తులులో ఆయన ఒకరు.ఇదొక్కటీ అంగీకారంలో ఉన్న నిజం. ఇక సంస్థలో అంతర్గత రాజకీయాలు ఎలా ఉన్నా..ఆయన ఎవరికి అండగా ఉన్నా లేకున్నా పాత్రికేయ పురస్కారం మాత్రం ఆయనకు అండగానే ఉంది.ఆ విధంగా ఎందుకనో ఆయనను ఉత్తమ పాత్రికేయుడు అని అంటోంది ఇటీవల ఓ ప్రచార ఆర్భాటం..అయినా కూడా ఆయన చేసిన మంచి పనులు కొన్నే అయినా అవి వెలుగులోకి వచ్చినవే అయినా ఎంఎన్ఆర్ తెలుగు పాత్రికేయ శైలిని మార్చారు అని చెప్పడంలో నవ్వులాట ఉంది కనుక నేను ఆ జోలికి పోను.ఎనీవే ఈనాడు అనే పెద్ద శక్తి (సామ్రాజ్య వాద శక్తికి) కి ప్రతినిధిగా నిలిచిన ఈ గుంటూరు కుర్రాడికి అభినందనలు చెప్పడం ఓ బాధ్యత.
ఈనాడు ఎడిటర్ (ఆంధ్రప్రదేశ్ విభాగం) మానుకొండ నాగేశ్వరరావు అలియాస్ ఎంఎన్ఆర్ అనే ఓ సామాన్యుడు,అతి సాదాసీదా రీతిలో బతికే రచయిత ఓ పని చేశాడు.డు కాదు రు.చేశారు.నిన్నటి వేళ ఆయన అరుణ్ సాగర్ స్మారక పురస్కారాన్ని పాత్రికేయ రంగంలో చేసిన కృషికి గుర్తింపుగా అందుకున్నాడు.డు కాదు రు.అందుకున్నారు.ఆ సందర్భంగా ఆయనకు వచ్చిన కొద్దిపాటి డబ్బులను అరుణ్ సాగర్ కుమార్తె ను వేదికపైకి పిలిచి అందించాడు. డు కాదు..అందించారు. ఇదీ ఇవాళ ఎంతో ఆనందించదగ్గ పరిణామం.అయితే సాగర్ మంచి కవిత్వం రాశాడా చెత్త రాశాడా అన్నది ఇప్పుడిక చర్చనీయాంశం కాదు కనుక భాగ్య నగరి దారుల్లో చెత్త కాగితాల్లో నలిగిన మంచి కవిత్వం అతడు రాశాడా లేదా అన్నది కూడా ఇప్పుడు పట్టించుకోవాల్సిన పనిలేదు కనుక ఎంఎన్ఆర్ చేసిన మంచి పనే ఇవాళ ఓ వ్యక్తిత్వానికి తార్కాణం.
ఎంఎన్ఆర్ అనే వ్యక్తి ఎప్పటి నుంచో ఈనాడు సంస్థలో ఉన్న ఉద్యోగి.ఉద్యోగి అనే రాయాలి..అంతకుమించి ఏం ఉందని..జర్నలిజం స్కూల్ ప్రిన్సిపల్..ఇంకా చెప్పాలంటే రామోజీ భక్తుడు..అంతకుమించి ఏం లేదు.ఆయనకూ సాహిత్య రంగానికీ ఎటువంటి సంబంధం లేదు.ఆయన పెద్దగా విశేషించి..తెలుగు సంస్కృతి రీతుల గురించి పెద్దగా కృషి చేసింది లేదు.అయితే ఈనాడు పాఠశాలకు మాత్రం మంచి పనులు కొన్నిచేసి పెట్టాడు.డు కాదు రు.పెట్టారు.కొన్ని వందల పాత్రికేయ ప్రతినిధులను జిల్లాలలో పని చేసే ఉప సంపాదకులను ఉన్నత రీతిలో తీర్చిదిద్దే ప్రయత్నం ఆయన చేశాడు.డు కాదు రు.ఇదొక్కటే ఆయన పాత్రికేయ రంగానికి చేసిన కృషి. అయితే సంస్థలో ఆయనేంట న్నది వదిలేసి ఆలోచిస్తే నిన్నటి వేళ చేసిన మంచి పని మాత్రం బాగుంది.పక్కనే ఉన్న ప్రసాద మూర్తి (ఆయనతో పాటూ కవిత్వంకు సంబంధించి పురస్కారం అందుకున్న వ్యక్తి) చేయలేని పని ఎంఎన్ఆర్ చేశాడు.డు కాదు రు.వెరీ గుడ్ సర్...ఈ ఒక్క విషయంలో కుదిరిన ఏకీభావం ఇది..మిగతా విషయాల్లో మీ సంస్థ నడవడిలో ఉండే విభేదాలు ఎప్పటిలానే యథాతథం.
- రత్నకిశోర్ శంభుమహంతి