వైసీపీలో రచ్చ పీక్స్..టీడీపీ పిచ్చ హ్యాపీ?
అందుకు ఉదాహరణలుగా రాష్ట్రంలో అనేక సంఘటనలు జరుగుతున్నాయి. పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావుపై స్థానిక వైసీపీ నేతలు ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు. ప్రతి పనికి రేటు కట్టి బాబూరావు పనిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అటు టెక్కలి వైసీపీ ఇంచార్జ్ దువ్వాడ శ్రీనివాస్‌పై కూడా సొంత పార్టీ నేతలు ఫైర్ అవుతున్నారు. దువ్వాడ వల్ల టెక్కలిలో వైసీపీ నాశనమవుతుందని, ఆయన్ని ఇంచార్జ్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటు తంబళ్ళపల్లెలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డిపై సొంత పార్టీ నేత కొండ్రెడ్డి తీవ్ర విమర్శలు చేయగా, కొండ్రెడ్డిని ఆ తర్వాత వేరే కేసులో అరెస్ట్ చేయించారు. అటు నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవికిషోర్‌పై కూడా సొంత పార్టీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఇవే కాదు చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్తితి. ప్రతిచోటా వైసీపీలో రచ్చ రచ్చ జరుగుతుంది.
ఇలా వైసీపీలో రచ్చ జరగడం టీడీపీకి బాగా హ్యాపీగా ఉందని చెప్పొచ్చు. వైసీపీలో ఉన్న లుకలుకలు టీడీపీకి బాగా కలిసొచ్చేలా ఉన్నాయి. ఇప్పటికే పాయకరావుపేటలో వైసీపీకి చాలా డ్యామేజ్ జరిగింది...అక్కడ టీడీపీకి బాగా ప్లస్ అవుతుంది. టెక్కలిలో బలపడాల్సిన వైసీపీ ఇంకా వీక్ అయ్యేలా ఉంది. అటు నంద్యాల, తంబళ్ళపల్లెల్లో కూడా వైసీపీలో ఉన్న పోరు..టీడీపీకి బాగా బెనిఫిట్ అయ్యేలా ఉంది. ఈ పరిస్తితి ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో వైసీపీకి డ్యామేజే.