కరోనా కేసులు పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం లాక్ డౌన్ ను అమలు చేసింది. ప్రజల మధ్య భౌతిక దురాన్ని ఉంచింది. అయినా కూడా చాలా మంది ప్రాణాలును కోల్పోయ్యారు. కరోనా వైరస్ మహమ్మారి ఆగడాలు ఇప్పటికీ ఆగడం లేదు. మహమ్మారి కారణంగా ఆర్థిక రంగం తీవ్రంగా దెబ్బతింది. ఈ క్రమం లో కరోనా వైరస్ ని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అహర్నిశలు కష్టపడుతున్నప్పటి కీ సరైన వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంతో కరోనా రోజురోజుకీ ఉధృతరూపం దాలుస్తోంది..
మొన్నటివరకూ 18 ఏళ్ల పైబడిన వారికి కరొన వ్యాక్సిన్ ను అందించిన ప్రభుత్వం ఇప్పుడు ఒమిక్రాన్ కేసులు పెరుగుతూన్నాయని భయం తో ఉంది. కాగా ప్రస్తుతం దేశ వ్యాప్తంగా దాదాపుగా 1700 ఓమిక్రాన్ కేసులు నమోదు కాగా ఇందులో 639 మంది విజయవంతం గా కోలుకొని బయట పడ్డారు. ఇక దేశంలో నే అత్యధికంగా 510 ఓమిక్రాన్ కేసులు మహారాష్ట్ర రాష్ట్రం లో నమోదయ్యాయి. పలు రాష్ట్రాల లో కూడా ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకుంటుంది.
ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే సినిమా పరిశ్రమ గడ్డు పరిస్థితుల ను ఎదుర్కోబోతోందని అర్థమవుతుంది. ఇప్పటికే చాలా సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్దంగా ఉన్నాయి. ఇలాంటి సమయం లో తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ లాక్ డౌన్ చేస్తె చాలా దారుణమైన పరిస్థితులను ఎదుర్క్కొవాల్సి వస్తుంది.ఇప్పటికే పశ్చిమ బెంగాల్, హర్యానా, ఢిల్లీ, మహారాష్ట్ర, ముంబై, కేరళ తదితర ప్రాంతాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాత్రిపూట కర్ఫ్యూతో పాటు పలు కార్యాలయాలు మరియు కళాశాలల లో ఆన్ లైన్ విధానాన్ని అనుసరిస్తున్నాయి. లాక్ డౌన్ పై తుది నిర్ణయం చెప్పనున్నట్లు తెలిపారు. మరో వైపు ఏపి లో కూడా ఈ విషయం పై చర్చలు జరుగుతున్నాయి. జగన్ సర్కార్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి..