మంత్రి మేకపాటి ఉగ్రరూపం.. నెల్లూరులో ఏం జరుగుతోంది..?

Deekshitha Reddy
ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే మంత్రి మేకపాటి ఒక్కసారిగా ఉగ్రరూపం ప్రదర్శించారు. అధికారులపై ఆయన చిర్రుబుర్రులాడారు, తనకు అధికారులంటే చాలా గౌరవం అని అంటూనే.. తనని మరోవైపు చూడాలనుకోవద్దని హెచ్చరించారు. మంత్రి రియాక్షన్ తో అధికారులు, స్థానిక నాయకులు కూడా షాకయ్యారు. ఇదొక్క ఉదాహరణే కాదు.. ఇటీవల మంత్రి మేకపాటి జిల్లాలో బాగా యాక్టివ్ అవుతున్నారు. ఇటీవల నెల్లూరు కార్పొరేషన్లో గెలిచిన కార్పొరేటర్లందరినీ మంత్రికి పరిచయం చేస్తూ ప్రత్యేక కార్యక్రమం కూడా నిర్వహించారు. చాలామంది నేతలున్నా కూడా ఈ కార్యక్రమంలో మేకపాటి హడావిడే ఎక్కువగా కనిపించింది.

గతంలో నెల్లూరు జిల్లా వైసీపీ అంతర్గత పాలిటిక్స్ విషయంలో రెండు మూడు సార్లు సజ్జల, బాలినేని వద్ద పంచాయితీలు జరిగాయి. అప్పట్లో మేకపాటిని జిల్లా రాజకీయాల్లో లీడ్ తీసుకోవాలని సీనియర్లు చెప్పినా ఆయన పెద్దగా పట్టించుకోలేదు. నియోజకవర్గంలో అందుబాటులో ఉండడని, ఇలా వచ్చి అలా వెళ్లిపోతారని ఇటీవల ఓ వర్గం మీడియా కూడా మేకపాటిని టార్గెట్ చేసింది. దీంతో ఆయన అలర్ట్ అయ్యారు జిల్లా రాజకీయాల్లో క్రియాశీలం అవుతున్నారు.

2019 ఎన్నికల్లో మేకపాటి రాజమోహన్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వకపోవడంతో.. గౌతమ్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చారని అనుకున్నారు కానీ.. ఆ తర్వాత జగన్ కేబినెట్ లో మంత్రి మేకపాటి యాక్టివ్ గా ఉంటున్నారు. కీలకమైన ఐటీ, పరిశ్రమల శాఖను మేకపాటికి అప్పగించారు జగన్. జాతీయ స్థాయి పర్యటనలతో ఐటీ, పరిశ్రమల రంగంలో రాష్ట్రానికి కీలక పరిశ్రమలు తెచ్చేందుకు కృషి చేశారు మంత్రి మేకపాటి. అదే సమయంలో స్థానిక రాజకీయాలను ఆయన ఇన్నాళ్లూ కాస్త పక్కనపెట్టారు. రాష్ట్ర రాజకీయాలు, తన శాఖకి సంబంధించిన అంశాలతో బిజీ అయ్యారు. మళ్లీ ఇప్పుడు ఆయన లోకల్ పాలిటిక్స్ పై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కలియదిరుగుతూ.. స్థానిక నాయకుల పనితీరు అంచనా వేస్తున్నారు. ఎక్కడికక్కడ సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చొరవ చూపుతున్నారు. అదే సమయంలో జిల్లాలో కీలక నేతగా ఎదిగేందుకు, జిల్లా రాజకీయాలపై పట్టు సాధించేందుకు కూడా మేకపాటి తన పంథా మార్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: