హీరో పవన్ కల్యాణ్ : ఆర్జీవీ డైరెక్షన్! జగన్ ప్రొడక్షన్ ?
సినిమా టికెట్ ధరల తగ్గింపుపై ఎప్పటికప్పుడు ఏదో ఒక వివాదం రేగుతూనే ఉంది.అయినప్పటికీ వైసీపీ ప్రభుత్వం దిగివచ్చేందుకు అస్సలు ఇష్టపడడం లేదు.90ఏళ్ల సినిమాను ఒక్క ఉదుటన నాశనం చేసిన ఘనత వైసీపీదేనని వైజాగ్ కు చెందిన సినిమా అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆవేదన చెందుతున్నారు.వీళ్లంతా సినిమానే నమ్ముకుని జీవిస్తున్న వారు.తమకు ఉపాధినిచ్చిన సినిమాను ఇంతటి దుర్భరావస్థలో నెట్టిన ఘనత జగనన్నదే అని కన్నీటిపర్యంతం అవుతున్నారు.హీరోలు బాగుంటేనే తాము బాగుంటామని, తాము చేసే సేవా కార్యక్రమాలకు అండగా నిలిచే హీరోలు ఇప్పుడు ఇలా సమస్యల్లో చిక్కుకుపోవడం బాధగా ఉందని వారంతా చెబుతు న్నారు.ఈ నేపథ్యంలో టికెట్ ధరల విషయమై ఏపీ సర్కారు పునరాలోచించాలని కోరు తున్నారు. మరోవైపు సీన్ లోకి రామ్ గోపాల్ వర్మ వచ్చారు.పేర్నినానిని టార్గెట్ గా చేసుకుని వరుస కామెంట్లు సోషల్ మీడి యా వేదికగా చేస్తున్నారు.అసలు ఓ ప్రొడక్ట్ కాస్ట్ నిర్ణయించేందుకు మీరెవరు అని ప్రశ్నిస్తున్నారు.
ఇదే సమయంలో జగన్ మోహన్ రెడ్డి అనే వ్యక్తి, తన స్నేహితులు అయిన కొడాలి నాని, వల్లభనేని వంశీ,పేర్నినాని లతో కలిసి ఓ సినిమా చేయాలని చేసి సత్తా చాటి పేదలకు ఉచితంగా చూపించాలని కోరుతూ మరో కామెంట్ పాస్ చేశారు.ఇప్పుడీ కామెంట్ మరింత వైరల్ అవుతోంది.సో అన్నీ కుదిరితే పవన్ కల్యాణ్ హీరోగా ఆర్జీవీ డైరెక్షన్లో జగతి మీడియా హౌస్ సారథ్యంలో ఓ సిని మా రావడం..దానికి జగనన్న డబ్బులు పెట్టడం అన్నవి ఖాయం అయిపోవచ్చని మీరూ నేనూ కాసేపయినా ఊహ వరకూ అయినా అనుకుందాం.ఏం పర్లేదు కొన్ని ఊహలు అందంగా ఉంటాయి.అందంగా ఉన్న ఊహలనే అమితంగా ఆహ్వానించడం అన్నది ఇప్పుడు మీరూ నేనూ మనందరం చేయాల్సిన పని.