ఫస్ట్ వేవ్ అయిపోయాక మెంటల్ గా కొంత కోలుకున్నారు. రిఫ్రెష్ అయ్యారు. కొంచెం కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది.కానీ అప్పుడు సెకండ్ వేవ్ వస్తుందని తెలియదు. అంతా సర్దుకుని క్లియర్ అయిపోతుందనే అనుకున్నారు. కానీ సెకండ్ వేవ్ వచ్చింది.దాంతో ఒత్తిడి ఎక్కువై, డిప్రెషన్ బారినపడ్డారు చాలామంది. ఆ ఎఫెక్ట్ ఫ్యామిలీ రిలేషన్స్,జాబ్స్ మీద క్లియర్ గా కనిపిస్తోంది. అందరూ బెటర్ అవుతున్నారని అనుకున్నాం. కానీ.. అలా లేదు మెంటల్ గా స్టెబుల్ అవ్వడానికి మరింత టైం కావాలి.ఇప్పుడు ఈ ఓమిక్రాన్ టైంలో మరింత నిబ్బరంగా ఉండాలి.
వ్యక్తిగతంగా చాలామందిలో చాలా ఆలోచనలు ఉంటాయి. ఉద్యోగం ఉంటుందా, లేదా వర్క్ ఫ్రం హోం కంటిన్యూ అవుతుందా, జీతం సరిగా వస్తుందా, లేదా? సగం జీతమే వస్తే,ఖర్చులు, ఈఎంఐలు క్లియర్ ఎలా అవుతాయి. ఫ్యామిలీ ని ఎలా చూసుకోవాలి. ఇలాంటి ఆలోచనలు ఒకలాంటి డిప్రెషన్ కు దారితీస్తాయి.
జాబ్ పోయినా.. సగం జీతమే వస్తున్నా.. ఏమీ కానట్టే గొప్పలకు పోతారు కొందరు. ఇదోరకం ప్రాబ్లం. జీతం వచ్చినా రాకున్నా,ఎలాంటి పరిస్థితి ఉన్నా సరే పార్టీలు, దోస్తులు, కార్లు, టూర్లు వీటన్నింటినీ మిస్ అవ్వకూడదన్నట్టు ఉంటారు. ఈ లైఫ్ స్టైల్ మార్చుకోవాల్సి వచ్చేసరికి కష్టంగా అనిపిస్తుంది. లక్షల్లో ఉండే పిల్లల స్కూలు ఫీజులు, ప్లాట్ ఈఎంఐ లు తలకు మించిన భారం అవుతాయి. దీంతో ఫైనాన్షియల్ టెన్షన్ పెరిగిపోతుంది. డబ్బులు రాక పోవడం ఒక ఎత్తు, స్టేటస్ కోల్పోవడం ఇంకో ఎత్తు. ఐసోలేషన్ లో ఉండటం వల్ల కూడా డిప్రెషన్ బారిన పడతారు. ఏం జరుగుతుందన్న విషయాన్ని హెల్త్ ఆర్గనైజేషన్స్ క్లియర్ గా చెప్పలేకపోతున్నారు. ఈ రెండేళ్లలో మనుషుల్లో పాజిటివ్ నెస్ పెరిగింది.
ఉన్న దాంట్లో కొంత పక్కననున్న వాళ్ళకి ఇవ్వడం, సాయం చేసే స్వభావం వంటివి పెరిగాయి. ఏదో ఒక పని కల్పించుకుని బిజీగా ఉండే ప్రయత్నం చేయాలి. పిల్లలతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాలి. మానసిక ప్రశాంతతకు ఇవన్నీ బాగా హెల్ప్ చేస్తాయి. కనీసం 8 గంటలు నిద్రపోవాలి. మంచి జరుగుతుందన్న నమ్మకంతో ఉండాలి.అలాగే వీటన్నింటితోపాటు సోషల్ స్కిల్స్ నేర్చుకోవాలి. కొత్త వర్క్ ఏదైనా నేర్చుకుంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది.ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలి. మనిషి ఆలోచనలను ఒత్తిడి లోకి నెట్టేసే రూమర్స్ పట్టించుకోకూడదు.