చిత్రమైన హోటల్.. అక్కడ నోటితో కాదు ఎలా ఆర్డర్ చేయాలంటే?

praveen
ఇటీవలి కాలంలో అన్ని అవయవాలు సరిగా పని చేస్తున్న వారు ఎలాంటి లక్ష్యాలు లేకుండా ఆవారాగా తిరుగుతూ ఉంటే పుట్టుకతోనే అంగవైకల్యంతో పుట్టిన ఎంతో మంది మాత్రం ఏదో సాధించాలనే తపనతో కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తూ ఉండటం గమనార్హం.  వైకల్యం దేనికి అడ్డు రాదు అని నిరూపిస్తున్న వారు చాలామంది తెరమీదికి వస్తున్నారు. ఇటీవలే పారా ఒలింపిక్స్ లో కూడా ఎంతోమంది అంగవైకల్యాన్ని జయించి గోల్డ్మెడల్ సాధించి ఎన్నో ప్రశంసలు అందుకున్న వారు కూడా ఉన్నారు. ఇక వివిధ రంగాలలో ఇలా అంగ వైకల్యం ఉన్నవారు కూడా రాణిస్తూ ఉండటం గమనార్హం. తమలో ఉన్న లోపాన్ని లెక్కచేయకుండా ఏదో సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.



 ఇక్కడ కొంతమంది ఇలా పుట్టుకతోనే వైకల్యం కలిగివున్నారు కానీ దాని గురించి వాళ్లు ఎప్పుడూ నిరాశ చెందలేదు. ఇలాంటి కొంత మంది ఒక్కచోట చేరి ప్రస్తుతం సక్సెస్ ఫుల్ గా  వ్యాపారంలో దూసుకుపోతున్నారు. ఒక హోటల్ స్థాపించి హోటల్ ను ఎంతో సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నారు. మహారాష్ట్రలోని పూణేలో ఎఫ్ సి రోడ్డు లో టెర్రాసైన్ హోటల్ వుంది ఇక్కడికి ఎవరైనా కస్టమర్లు రాగానే అందులో ఉన్న సిబ్బంది చిరునవ్వుతో స్వాగతం పలుకుతూ సైగలతో సంభాషణ చేయడం మొదలు పెడుతూ ఉంటారు. ఎందుకంటే అక్కడ ఉన్న యువతీ యువకులు అందరూ కూడా పుట్టుకతోనే వినికిడి మూగ సమస్యతో బాధపడుతున్నారు.


 ఒకరో ఇద్దరో కాదు ఏకంగా హోటల్లో ఉన్న సిబ్బంది మొత్తం ఇలా సమస్యలతో బాధపడుతున్నవారే కావడం గమనార్హం. విజయవంతంగా హోటల్ నిర్వహిస్తూ తమలాంటి ఎంతో మంది యువతీ యువకుల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిస్తున్నారు. బదిరా యువతీయువకులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో టెర్రాసైన్ పేరుతో హోటల్ లో స్థాపించారు సోనం కాపాసే.  అంతేకాదు సిబ్బంది మధ్య కమ్యూనికేషన్ ఉండేందుకు సైగల భాషలు కూడా నేర్పించారు. ఇక ఖాతాదారుల కోసం ప్రత్యేకమైన కార్డు కూడా తయారు చేశారు. మెనులో ఉన్న వంటకం పేరు పక్కన ఎలాంటి సైగ చేయాలి అని కూడా ముద్రించారు. ఇక ఆ హోటల్ కి వచ్చిన కస్టమర్లు మెనూ లో ఉన్నట్లుగానే సైగలు చేసి ఆర్డర్ చేస్తూ ఉంటారు. బధిర యువతీ యువకులు ఎంతోమందిలో స్ఫూర్తిని నింపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: