ప్రపంచం కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ప్రపంచ దేశాలకు 2022 సంవత్సరం ఎన్నో ఆశలను రేపుతోంది. అయితే చైనీయులకు మాత్రం కొత్త సంవత్సరం ప్రారంభంలోనే బ్యాడ్ న్యూస్ వినాల్సి వస్తుంది. ఒకపక్క పెరుగుతున్న కరోనా కేసులు, మరోపక్క అతిపెద్ద స్పోర్ట్స్ ఈవెంట్ నేపథ్యంలో ఇండోనేషియా బ్యాడ్ న్యూస్ తెలిపింది. చైనాకు బొగ్గు సరఫరా చేసే అతిపెద్ద ఎక్స్పోర్టర్ అయినా ఇండోనేషియా ప్రస్తుతం నో స్టాక్ అని బోర్డు పెట్టేసింది. చైనాకు ప్రస్తుతం కరెంటు అతిపెద్ద సమస్యగా నడుస్తోంది. ఎందుకంటే అక్కడ కరెంటు ఉత్పత్తి చేసే థర్మల్ స్టేషన్స్ అన్నింటిలో బొగ్గు షార్టెజ్ వేధిస్తోంది. బొగ్గు లేక కరెంటు ఉత్పత్తి కాక అనేక నగరాల్లో మొన్నటిదాకా ఫోన్ చార్జింగ్ కూడా కష్టంగా మారింది.
ఒక దశలో పరిశ్రమలు లాకౌట్ ప్రకటించాల్సి వచ్చింది. అలాంటిది ఇప్పుడు మరోసారి ఆ సమస్య రాబోతోంది. ఇండోనేషియా నుంచి రావాల్సిన బొగ్గు ఇకపై కష్టమేనని ఆ దేశం ప్రకటించడంతో చైనాకు చిక్కులు తప్పడం లేదు. ఈసారి శీతాకాలం దారుణంగా ఉండడంతో జనం హీటర్లు వాడతారు. గడ్డకట్టుకుపోయే చలి నుంచి తమని తాము కాపాడుకునేందుకు కరెంట్ అత్యవసరంగా ఉంటుంది. ఈ సమయంలో ఇండోనేషియా చేసిన ప్రకటన చైనాలో డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇప్పటికే ఇండోనేషియా అన్ని బొగ్గు ఎగుమతులను నిలిపివేసింది. జనవరి మాసం మొత్తానికి ఏ దేశానికైనా సరే బొగ్గు ఎగుమతి చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేసింది. ఈ నిర్ణయం చైనాకు మాత్రం కష్టాలు తెచ్చిపెట్టేలా ఉందని చెబుతున్నారు నిపుణులు. ఇండోనేషియా బొగ్గు లేదంటే చైనాలో పనులు జరిగే అవకాశం లేదు. సాధారణ జన జీవనం చాలా రోజుల దాకా అస్తవ్యస్తం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇండోనేషియాలో కూడా కరెంటు కష్టాలు తప్పడం లేదు. అందుకే ముందు తమ సమస్యలు తీరాకే ఎగుమతుల విషయం
ఆలోచిస్తామని చెప్పారు. కరోనా తర్వాత ప్రపంచ మార్కెట్లు ఇప్పుడిప్పుడే మళ్లీ పుంజుకుంటున్నాయి. ఈ క్రమంలో చైనా ముందుచూపు లేని ధోరణి కారణంగా మళ్లీ గ్లోబల్ మార్కెట్ షేక్ అవుతాయనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు మళ్ళీ ఇండోనేషియా వల్ల రాబోయే విద్యుత్ కొరత వల్ల చైనా పరిశ్రమలు అంధకారంలోకి జారిపోబోతున్నాయి. ఈ ప్రభావం ప్రపంచంపై కచ్చితంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు.