ఖేల్ ఖతం : కొత్త అప్పు లెక్క ఎంతంటే? దండాలయ్యా సామికి!
మళ్లీ నేలకు చేరడం ఓ లక్షణం
కానీ అసలు దూరం ఎంత వరకూ
అన్నది ఆయనకు తెలియదు
శిఖరం ఎత్తు ఆయనకు అంచనా రాదు
అందుకే అప్పుల్లో ఆంధ్రాను ఉంచి,ఢిల్లోలో బేరసారాలు నడపడంతో శాలువా 1,శాలువా 2 దృశ్యాలు తెగ వైరల్ అవుతున్నాయి.శాలువ-1 అనగా ప్రధానితో తీసుకున్న
ఫొటో..ఆయనను సత్కరిస్తూ..శాలువ-2 ఆర్థిక మంత్రి నిర్మలమ్మను సత్కరిస్తూ..తీసుకున్న ఫొటోలు..ఇవే ఇప్పుడు చిత్రం చెప్పిన కథ రూపాన వైరల్ అవుతున్నాయి.
అయినా అన్నయ్య అవేవీ పట్టించుకోరు..కొంచెం అప్పు పుడితే మళ్లీ ఊపిరి వచ్చి,కొత్తగా కొత్త పథకం ఒకటి ప్రవేశ పెట్టి ఎంచక్కా డబ్బులు పంచి ఆఖరికి మన నెత్తిన బండ పెట్టి వెళ్లిపోవడం ఖాయం అని అంటోంది జగన్ ను ఉద్దేశించి విపక్షం.
ఇక కొత్త అప్పులు ఎలా ఉన్నాయో చూద్దాం
రిజర్వు బ్యాంకు దగ్గర సెక్యూరిటీల వేలం ద్వారా తెచ్చిన అప్పు 2500 కోట్లు
ఎనిమిది రోజులుగా చేసిన అప్పు 4500 కోట్లు
ఇంత తెచ్చినా కూడా జగన్ సర్కారుకు ఆఖరి త్రైమాసికానికి ఎంత అప్పు
ఇవ్వాలో కేంద్రం తేల్చలేదు.
ఆర్థిక సంవత్సరంలో ఆఖరి త్రైమాసికం అంటే జనవరి నుంచి మార్చి వరకు అని అర్థం.
దండలు వెయ్యర సామికి
వందనాలు అని పాడుకోండి
ఏం కాదు
అంతటి మంచితనం మన సీఎం జగన్ మోహన్ రెడ్డిలో ఉంది.ఆ విధంగా ఉన్నందుకు ఆనందిస్తూనే ఏమయినా ఆయన కోసం రాయాలి అని,రాసిందేదో పాట రూపంలో రాగయుక్త భావ తాళ గతులలో వినిపించాలని అనిపిస్తోంది.అందుకే మా యువ సీఎం అంటే మాకెంతో ఇష్టం. ఆయనను ఎవ్వరు ఏమన్నా ఒప్పుకోం.ఆయన మాకు ప్రత్యేకం..మేం ఆయనకు ఇంకా ఎక్కువ ప్రత్యేకం మరియు సమానం కూడా! సమానం అన్న చోట మీరు చాలా జాగ్రత్తగా చదవాలి.ఆ విధంగా మీరు ముందో వెనుకో చూసుకుని ఆంధ్రావనిలో అప్పులు ఉన్నాయా లేవా అన్నది చూసుకోవాలి..వింటున్నారా చిట్టి తండ్రి!