సైనికుడు మృతదేహం వద్దంటా.. మరి ఇంత నీచమా?

praveen
దేశాన్ని కాపాడేందుకు సరిహద్దుల్లో కి వెళ్లే సైనికుడు చేసిన త్యాగాలు అన్నీ ఇన్నీ కావు. అందరి లాగా నేను కూడా హాయిగా ఇంటి దగ్గరే ఉంటూ ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ కుటుంబంతో సంతోషంగా ఉండొచ్చు కదా అని అనుకోకుండా దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించడాని కంటే ఇక ఈ జీవితానికి ఇంకేం కావాలి అని భావిస్తూ సరిహద్దులకు పయనమవుతు  ఉంటాడు ప్రతీ సైనికుడు. కుటుంబానికి దూరంగా భార్య పిల్లలకు దూరంగా రోజుల తరబడి సరిహద్దుల్లో కఠినమైనపరిస్థితుల మధ్య దేశానికి రక్షణ కవచం గా నిలుస్తూ ఉంటాడు. ఎప్పుడు ఎటు వైపు నుంచి శత్రువు దాడి చేస్తాడో తెలియని పరిస్థితుల్లో దేశానికి రక్షణ కల్పించేందుకు నిరంతరం కంటి మీద కునుకు లేకుండా పని చేస్తూ ఉంటాడు.



 సరిహద్దులో సైనికుడు అనేవాడు లేకపోతే దేశంలోని ప్రజలు ఎవరూ కూడా ప్రశాంతంగా నిద్రపో లేరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.. అందుకే సరిహద్దులో సైనికుడు ప్రాణాలు కోల్పోతే త్రివర్ణ పతాకాన్ని శవపేటిక పై కప్పి ఎంతో గౌరవంగా అంత్యక్రియలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే అటు పాకిస్థాన్ లో మాత్రం దేశానికి రక్షణ కల్పించే సైనికులకు కనీస గౌరవం కూడా ఇవ్వరు. ఇక ఈ విషయం ఇప్పటికే ఎన్నోసార్లు బయటపడగా.. ఇటీవల జరిగిన ఘటన కూడా పాకిస్థాన్ ప్రభుత్వం  సైనికుల విషయంలో ఎంత దారుణం గా వ్యవహరిస్తుంది అన్న దానికి నిదర్శనంగా మారింది.



  సరిహద్దుల్లో సైనికులను దేశ రక్షణ కోసం కాకుండా ఉగ్రవాదూల్లా వాడుకుంటూ ఉంటుంది పాకిస్తాన్. ఏకంగా ఉగ్రవాద సంస్థలలో భాగస్వామ్యం చేస్తూ భారత్లో ఎన్నో మారణహోమాలు సృష్టించడమే లక్ష్యంగా సైనికులను పంపిస్తూ  ఉంటుంది. దేశానికి రక్షణ కల్పించే సైన్యంతో ఎన్నో నీచమైన  పనులు చేస్తూ ఉంటుంది పాకిస్తాన్. అయితే ఇటీవలే  బ్యాట్ అనేటువంటిది పాకిస్తాన్ సైనిక వ్యవస్థ అని ఇటీవల పాకిస్తాన్ ప్రభుత్వం తెలిపింది. అయితే ఇటీవలే బ్యాట్ కి చెందినటువంటి  ఒక సైనికుడు తీవ్రవాద చర్యకు పాల్పడడంతో భారత సైన్యం ఎన్కౌంటర్ చేసింది. ఎన్కౌంటర్ చేసిన వ్యక్తి పాకిస్థాన్కు చెందిన బ్యాట్ సంస్థకు చెందినసైనికుడు అని పాకిస్తాన్ కు చెబితే.. అతను మా సైనికుడు కాదు  మృతదేహం అవసరం లేదు అంటూ పాకిస్తాన్ సమాధానం చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఈ ఒక్క ఘటన సైన్యాన్ని పాకిస్థాన్ ఎలా చూస్తుంది అని అర్థం ఎలా చేస్తుంది  అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: