వైసీపీ వైరస్ కు.. టీడీపీ పార్టీనే వ్యాక్సిన్ ?

Veldandi Saikiran
వైసీపీ వైరస్సుకు టీడీపీనే వ్యాక్సిన్ అని..  బీసీల అభ్యున్నతే మా లక్ష్యమన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.. మైనార్టీల మీద కూడా దాడులు చేస్తారా..? మదర్సాలపై దాడి చేస్తారా..? వైసీపీకి ఓట్లేయడమే మైనార్టీలు చేసిన తప్పా..? అని ఫైర్ అయ్యారు.  ప్రశ్నిస్తే కేసులు పెడతారా..? కేసులకు భయపడి టీడీపీ పారిపోవాలా..? టీడీపీని లేకుండా చేయడం వైసీపీ వల్ల కాదు కదా.. ఆ పార్టీని పుట్టించిన వారి వల్ల కూడా కాదు. ఆనాడు హైదరాబాదులో ఔటర్ రింగ్ రోడ్డు కూడా గ్రాఫిక్సే అని మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఆనాటి గ్రాఫిక్సే.. ఇప్పుడు 8 లేన్ల రోడ్డు అయిందని.. మూడేళ్లల్లో జగన్ ప్రభుత్వం మూడు ఇళ్లు కూడా కట్టలేదని అగ్రహించారు టీడీపీ అధినేత చంద్రబాబు. 


ఆస్పత్రుల్లో మందులు కూడా కరువయ్యాయి.. వేయి రూపాయలు దాటితే ఉచితంగా వైద్యం అన్నారు.. అది అమలు చేయడం లేదన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. మధ్యాహ్న భోజన పథకం అమలు చేయలేని అసమర్ధ ప్రభుత్వమని.. మెజార్టీ లేదని మండలి రద్దు చేస్తామన్నారు.. మెజార్టీ రాగానే రద్దును పక్కన పెట్టేశారని ఫైర్ అయ్యారు. మండలి విషయంలో ప్రభుత్వం తీరుకు వైసీపీకి సిగ్గు అనిపించడం లేదా..? పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు.


చట్టాన్ని అతిక్రమించి వ్యవహరించిన అధికారులకు శిక్ష తప్పదు... గతంలో జగనుకు సహకరించిన అధికారులు జైళ్లకు వెళ్లారన్నారు. మద్యపాన నిషేధం అన్నారు.. మద్యపానాన్ని ప్రొత్సహిస్తున్నారు. మద్యంపై ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారని పేర్కొన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచారు.. రేపో మాపో మళ్లీ పెంచబోతున్నారని..  రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని కోరారు. పన్నులు పెంచారు.. సొంత ఖజానాను నింపుకుంటున్నారన్నారు.  ఏపీని అప్పువ ఊబిలోకి నెట్టేస్తున్నారు...  ప్రత్యేక హోదా, పోలవరం, రైల్వే జోన్, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయం ఏమైంది..? ధైర్యముంటే సాధించావి.. లేకుంటే ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: