ఓరి నాయనో.. తాలిబన్ల అద్భుత దళం?

praveen
దాదాపు రెండు దశాబ్దాల తర్వాత తాలిబన్లు ఆప్ఘనిస్థాన్లో ఆధిపత్యాన్ని చేపట్టారు. ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబాన్లు అధికారంలోకి రావడానికి ఒక రకంగా అమెరికా ప్రభుత్వమే కారణమని చెప్పాలి. అమెరికా ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న తన సైనికులను వెనక్కి పంపించటం తోనే తాలిబన్లు రెచ్చిపోయి మరీ ప్రజాస్వామ్యాన్ని మంటగలిపే ఆయుధాలతో ఎన్నో అరాచకాలు సృష్టించారు. ఎదురు తిరిగిన వారి ప్రాణాలు తీసి క్రమక్రమంగా దేశం మొత్తాన్ని తన అధీనంలోకి తెచ్చుకున్నారు. ఇక ఇప్పుడు తాలిబన్ల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పాలన కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే తాలిబన్ల ప్రభుత్వం అమలులోకి వచ్చిన తర్వాత చేస్తున్న పాలన అరాచకం గానే ఉంది అని చెప్పాలి.


 ప్రజలందరినీ బానిసలుగా చూస్తూ కఠిన ఆంక్షలు అమలులోకి తీసుకు వస్తున్నారు. ఇక మరోవైపు అటు మహిళలను అయితే కేవలం సెక్స్ బానిసలుగా మాత్రమే చూస్తూ దారుణంగా వ్యవహరిస్తున్నారు. అయితే కేవలం ప్రభుత్వంలో మాత్రమే కాదు ఆర్మీ లో కూడా ప్రస్తుతం తాలిబన్లు ఉండటం గమనార్హం. ప్రస్తుతం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పాలన సాగిస్తున్న తాలిబన్లు ఇక ఇప్పుడు  తమ కోసం ఒక ప్రత్యేకమైన  ఆర్మీ ని సిద్ధం చేసుకునేందుకు రెడీ అవుతుంది అన్న విషయం  ప్రస్తుతం అంతర్జాతీయ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. సాధారణంగా ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడుల గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది.



 శరీరం మొత్తం బాంబులు చుట్టుకొని ఆత్మహత్యకు పాల్పడుతూ మారణహోమం సృష్టిస్తూ ఉంటారు ఎంతో మంది ఉగ్రవాదులు. అయితే ఇక ఇలాంటి వారిని తాలిబన్లు వీరోచిత సైనికులుగా గుర్తిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రానున్న రోజుల్లో తమ సైన్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఇక ఇలాంటి ఆత్మాహుతికి  పాల్పడేందుకు కొంతమంది సైనికులను తాలిబన్ ప్రభుత్వం తయారు చేస్తున్నట్లు ప్రస్తుతం టాక్ వినిపిస్తోంది. దీనినే తాలిబన్ల అద్భుత దళం అంటూ త్వరలో ప్రపంచానికి పరిచయం చేయబోతున్నారట. ఇది కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: