అమరావతి : వైసీపీ జాక్ పాట్ కొట్టబోతోందా ?
విజయసాయి వైసీపీకి చెందిన ఎంపి అయితే మిగిలిన ఇద్దరు సురేష్ ప్రభు, టీజీ వెంకటేష్, సుజనా చౌదరి టీడీపీ తరపున ఎంపికై బీజేపీలోకి పిరాయించారు. సురేష్ ప్రభు బీజేపీ నేతే అయినప్పటికీ ఏపి నుండి టీడీపీ కోటాలో రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. అలాగే తెలంగాణా నుండి కెప్టెన్ లక్ష్మీకాంతరావు, డీ. శ్రీనివాసరావు రిటైర్ కాబోతున్నారు. తొందరలో ఖాళీ కాబోతున్న ఆరు స్ధానాలు కూడా రెండు రాష్ట్రాల్లోని అధికారపార్టీల ఖాతాలోనే పడతాయనటంలో అనుమానం లేదు.
తెలంగాణాలో రెండు స్ధానాలను ఎవరితో భర్తీ చేస్తారో తెలీదు. కానీ ఏపిలో భర్తీ చేయాల్సిన నాలుగు స్ధానాల విషయంలో ఆసక్తి పెరిగిపోతోంది. అయితే ఈ నాలుగు స్ధానాల్లో విజయసాయిరెడ్డికి రెన్యువల్ అయ్యే అవకాశాలు దాదాపు ఖాయమనే చెప్పాలి. మిగిలిన మూడు స్ధానాల విషయంలోనే ఆసక్తి పెరిగిపోతోంది. ఎప్పటిలాగే బీసీ, ఎస్టీ, ఎస్సీ, మహిళా, ముస్లిం మైనారిటిలకు ప్రాధాన్యత ఇస్తారనే అనుకుంటున్నారు.
ఇప్పటికే వైసీపీ తరపున రాజ్యసభలో విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, పరిమళ్ నత్వాని ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ఆరుగురు+తొందరలో ఎంపిక కాబోయే ముగ్గురితో కలిపి రాజ్యసభలో పార్టీ బలం తొమ్మిదికి చేరుకుంటుంది. ఒకేసారి ముగ్గురు నేతలను రాజ్యసభకు పంపటమంటే జాక్ పాట్ అనే చెప్పాలి.
గతంలో కూడా నత్వాని, మోపిదేవి, పిల్లి, అయోధ్యలు ఒకేసారి రాజ్యసభకు ఎంపికయ్యారు. మొత్తం కలిపి అంటే లోక్ సభ+రాజ్యసభలో వైసీపీ ఎంపీల బలం 31కి పెరగబోతోంది. కాకపోతే ఇంతమంది ఎంపీలున్నా రాష్ట్రానికి వీళ్ళవల్ల ఏమిటి ఉపయోగమనేదే చూడాలి. ఇంతమంది ఎంపీలున్న అధికారపార్టీ రాష్ట్రప్రయోజనాలను సాధిస్తేనే కోసం కూడా పోరాటాలు చేస్తేనే ఎంపీల బలానికి సార్ధకత వస్తుంది. లేకపోతే ఉపయోగం ఏమిటి ?