టీడీపీలో ‘ఒక్కడు’..నిలబెట్టేశాడుగా!

M N Amaleswara rao
ఒక్క భారీ ఓటమి టీడీపీలో అనేక మార్పులకు కారణమైంది. గతంలో కూడా టీడీపీ కొన్ని ఓటములు చూసింది గానీ, 2019 ఎన్నికల్లో వచ్చిన ఓటమి ఎప్పుడు రాలేదు. జగన్ దెబ్బకు టీడీపీ అడ్రెస్ గల్లంతయ్యే పరిస్తితి వచ్చింది. అసలు జగన్ వేవ్‌లో టీడీపీలో బడా బడా నేతలు ఓడిపోయారు. ఇక ఈ పరిస్తితుల నుంచి పార్టీని పడేయడానికి చంద్రబాబు గట్టిగానే కష్టపడుతున్నారు. టీడీపీలో కూడా అనూహ్యా మార్పులు తీసుకొచ్చారు. పార్టీని ప్రక్షాళన చేశారు.

ఇందులో భాగంగానే ఏడాదిన్నర క్రితం చంద్రబాబు...పార్లమెంట్ అధ్యక్షులని నియమించిన విషయం తెలిసిందే. అంతకముందు జిల్లాల వారీగా అధ్యక్షులు ఉండేవారు. అయితే జిల్లాల పరంగా ఎక్కువ స్థానాలు ఉండటం వల్ల నాయకులకు...అన్నీ స్థానాలని కవర్ చేసే సమయం అంతగా ఉండేది కాదు...దీని వల్ల పార్టీకి కాస్త డ్యామేజ్ జరిగింది. అందుకే జిల్లా అధ్యక్షుల వ్యవస్థని తీసేసి..పార్లమెంట్ స్థానాల వారీగా అధ్యక్షులని పెట్టారు. పార్లమెంట్ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. ఇక వాటిల్లో టీడీపీని బలోపేతం చేయాల్సిన బాధ్యత అధ్యక్షులది.

మరి పార్లమెంట్ అధ్యక్షులు వచ్చి ఏడాది దాటింది..మరి ఏ అధ్యక్షుడు బాగా పనిచేస్తున్నారంటే? ఫస్ట్‌లో కొందరు అధ్యక్షులు సరిగ్గా పనిచేయలేదు. అసలు వారు నియోజకవర్గాల్లోనే తిరిగేవారు. కాదు కానీ గత ఆరు నెలల నుంచి 25 మంది పార్లమెంట్ అధ్యక్షులు యాక్టివ్ అయ్యారు. తమ పార్లమెంట్ స్థానాల్లో దూకుడుగా పనిచేస్తున్నారు. ఇక వీరిలో బాగా పనిచేసే అధ్యక్షులు ఉన్నారు.

అలా బాగా పనిచేసేవారిలో బాపట్ల పార్లమెంట్ అధ్యక్షుడు ఏలూరి సాంబశివరావు ముందు వరుసలో ఉన్నారని చెప్పొచ్చు. అసలు చెప్పాలంటే మిగిలిన అధ్యక్షులతో పోలిస్తే...తన పార్లమెంట్ స్థానంలో దాదాపు అన్నీ అసెంబ్లీ స్థానాల్లో పార్టీని పికప్ అయ్యేలా చేసిన నేత ఏలూరి. బాపట్ల పరిధిలో పర్చూరు, అద్దంకి, రేపల్లె, వేమూరు, బాపట్ల, సంతనూతలపాడు స్థానాల్లో టీడీపీ స్ట్రాంగ్‌గా ఉంది. ఒక్క చీరాలలో కాస్త పికప్ అవ్వాలి. మొత్తం మీద చూసుకుంటే ఏలూరి...బాపట్లలో టీడీపీని నిలబెట్టేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: