వామ్మో.. లూడో గేమ్.. పాకిస్తాన్ తీసుకెళ్ళింది?
ఎన్నో రకాల ఆన్లైన్ గేమ్స్ తెరమీదికి వస్తూ అందరినీ ఆకర్షిస్తూ క్రమక్రమంగా బానిసలుగా మార్చుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఇటీవలి కాలంలో ఎంతో మందిని ఆకర్షిస్తున్న ఆన్లైన్ గేమ్ ఏదీ అంటే అది లూడో అన్న విషయం తెలిసిందే. చిన్న నుంచి పెద్దల వరకు అందరూ కూడా లూడో గేమ్ ఆడటానికి ఇష్టపడుతున్న వారు చాలా మంది ఉన్నారు. హాయిగా ఒక దగ్గర కూర్చొని ఆడే గేమ్ కావడంతో ఇక ఈ గేమ్ ఆడేందుకు మరింత ఆసక్తి చూపుతున్నారు. క్రమక్రమంగా లూడో గేమ్ కి బానిసలుగా మారిపోతున్నారు వారు కూడా ఎక్కువై పోతున్నారు. అయితే జనాలపై లూడో గేమ్ ఎంత ప్రభావం చూపుతుంది అన్న దానికి ఇక్కడ జరిగిన ఘటన నిదర్శనంగా మారిపోయింది అని చెప్పాలి.
ఇటీవలే లూడో గేమ్ కి బానిస గా మారిపోయిన ఒక మహిళ భారత్ నుంచి పాకిస్థాన్ బయలుదేరింది. ఎందుకు అంటారా.. లూడో గేమ్ లో పుట్టిన ప్రేమ కారణంగా.. లూడో గేమ్ లో రాజస్థాన్ కు చెందిన మహిళకు పాకిస్థాన్కు చెందిన ఒక టీనేజర్ పరిచయం అయ్యాడు.. ఈ క్రమంలోనే పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో అతనితో కలిసి ఉండాలని భావించింది మహిళా. ఈ క్రమంలోనే వాఘా బార్డర్ ద్వారా పాకిస్థాన్కు లోకి వెళ్ళాలి అని ప్లాన్ వేసింది. కానీ ఆటోడ్రైవర్ కు అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు సదరు మహిళను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది. సదరు మహిళకు భర్త పిల్లలు కూడా ఉన్నట్లు విచారణలో తేలింది.