గత కొన్ని రోజులుగా తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ పోరు నడుస్తోంది. ఇది హుజురాబాద్ ఎన్నికలకు ముందు ఈటల వర్సెస్ కేసీఆర్ అన్న తీరులో రాజకీయాలు హీటెక్కిపోయాయి. ఇక హుజురాబాద్ ఉప ఎన్నిక గెలుపుతో ఈటలతో పాటు బీజేపీ నాయకుల్లో కొత్త జోష్ నింపింది. దీంతో రాష్ట్ర రాజకీయాలతో పాటు దేశ రాజకీయాలు ఈటలపై ఆసక్తి పెంచుకుంది. ఇదే క్రమంలో ఈటల ఫేమ్‌ను తగ్గించడానికే కేసీఆర్ బండి సంజయ్‌ను టార్గెట్ చేశారన్న అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. తాజాగా నెలకొన్న వరిధాన్యం కొనుగోలు కొట్లాటతో బీజేపీ - టీఆర్ఎస్లు ఢీ అంటే ఢీ అంటూ ముందుకు సాగిపోయాయి.
ఈ క్రమంలో బండి సంజయ్ కేసీఆర్ టార్గెట్‌గా విమర్శలు మొదలు పెట్టారు. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటె తెలంగాణ రాజకీయాల్లో బండి సంజయ్ పేరు మార్మోగి పోతుందనే చెప్పాలి. ఈటల క్రేజ్ పెరుగుతున్న వేళ బండి సంజయ్ జివో నెం 317 ఉద్యోగ బదిలీల అంశానికి వ్యతిరేకంగా తన క్యాంపు కార్యాలయంలో దీక్ష చేపట్టారు. అయితే, కొవిడ్ నిబంధనలు అమలులో ఉండంతో బండి సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేసి జైళ్లో వేశారు. దీంతో బీజేపీ నేతలు పెద్ద స్థాయిలో బండి సంజయ్ కు మద్ధతుగా నిలివడంతో పాటు అన్ని వర్గాల నుంచి సపోర్ట్ లభించింది.
అంతే కాకుండా బండి సంజయ్‌కు మద్ధతుగా ఇప్పటికే బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపి నడ్డా హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ పై విమర్శలు చేయడంతో పాటు బండి సంజయ్‌ను పొగుడుతూ ఆకాశానికి ఎత్తేశారు. ఈ క్రమంలో చత్తీస్ఘడ్ మాజీ సీఎం రమణ్ సింగ్ వచ్చి బండి సంజయ్‌ను పరామర్శించారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి కోసం వచ్చి పరామర్శించడంతో ఆయన ఇమెజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.. కాదు పెంచేశారు. బండిని బలమైన నేతగా మార్చేందుకే కేంద్ర అధినాయకత్వం ఆయనకు ఫుల్ సపోర్ట్ ఇస్తూ వస్తోంది.