పాపం పాకిస్తాన్.. ఎంత కష్టం వచ్చింది?
చూస్తూ చూస్తుండగానే చాపకింద నీరులా అన్ని దేశాలకు పాకి పోతుంది ఈ కొత్త వేరియంట్. ఈ క్రమంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేస్తుంది అన్న విషయం తెలిసిందే. రెండవ దశలో వ్యాప్తిచెందిన డెల్టా వెరీయంట్ కంటే కొత్త వేరియంట్ ఓమిక్రాన్ ఐదురెట్లు ప్రమాదకారి అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఎన్ని కేసులు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో మళ్లీ కఠిన ఆంక్షలు అమలులోకి తీసుకు వస్తూ ఉన్నాయి. అయితే సాధారణ కరోనా వైరస్ టెస్టింగ్ ద్వారా కాకుండా జినోమ్ సీక్వెసింగ్ టెస్టింగ్ ద్వారా మాత్రమే ఓమిక్రాన్ గుర్తించవచ్చు అంటూ శాస్త్రవేత్తలు తెలిపారు.
కానీ ఇలాంటి టెస్టింగ్ టెక్నాలజీ కొన్ని దేశాలలో మాత్రం అందుబాటులో లేదు. అలాంటి దేశాలలో పాకిస్తాన్ కూడా ఒకటి అని చెప్పాలి. పాకిస్తాన్లోని కరాచీ లో వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే కరాచీలో లాక్ డౌన్ ప్రకటిస్తూ ఇటీవలే పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ప్రస్తుతం పాకిస్థాన్లో కేసులను గుర్తించడానికి జినోమ్ సీక్వెసింగ్ ల్యాబ్ లు పాకిస్తాన్లో అందుబాటులో లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని అర్థమవుతుంది. కేసులు పెరిగిన చోట కఠిన ఆంక్షలు తీసుకురావడం మాత్రమే చేస్తుంది పాకిస్తాన్ ప్రభుత్వం.