ట్రోలింగ్ వ‌ర్డ్ : కుప్పం..చంద్ర‌బాబు

RATNA KISHORE

రోజులు మారాయి
కార్య‌క‌ర్త‌లు చెబితేనే
అక్ర‌మాలు కూడా
వెలుగులోకి వ‌స్తున్నాయి
పాపం ఆ పాటి చంద్ర‌బాబుకు
తెలియ‌క పోవ‌డం ఓ వింత
పెద్దిరెడ్డికే అంతా తెలుసులే అని
అనుకోవ‌డం ఇంకా వింత
సీమ రాజ‌కీయంలో పెద్దిరెడ్డి ప్రేమ
బాబు ద్వేషం ఈ రెండూ కొద్ది క్ష‌ణాలే
పార్టీల‌కు అతీతంగా....



మీడియా పిలిస్తే చంద్ర‌బాబు ప‌లుకుతాడు.. చంద్ర‌బాబు అరిస్తే రామోజీ అరుస్తాడు..అంత‌టి బంధం ఉన్న వారిద్ద‌రికీ ఇందాక కుప్పంలో వైసీపీ అక్ర‌మాలు క‌నిపించ‌డం లేదా? అయ్యో! పెద్దిరెడ్డి ఎంత ప‌ని చేస్తాండు? ప‌సుపు పార్టీ అధిప‌తి చంద్ర‌బాబుకు చెప్ప‌కుండానే మైనింగ్ చేసేస్తున్నాడా? వామ్మో! ఇంత‌కుమించిన జోక్ ఇంకోటి లేద‌య్యో!


కుప్పం కుప్పం కుప్పం అని మీడియా మూడుసార్లు రోజుకు స్మ‌రిస్తుంది.అంటే మూడు పూట‌లా స్మ‌రిస్తుంది అని అర్థం.ఎందుకంటే కుప్పంలో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది క‌నుక!అదే సంద‌ర్భంలో పాత స్నేహితుడు, కొత్త శ‌త్రువు అయిన పెద్దిరెడ్డి అదే ప‌నిగా చంద్ర‌బాబును తిడుతున్నాడు క‌నుక! ఈ వారం టీడీపీ ని వైసీపీ బాగానే టార్గెట్ చేసింది.అనుకున్న విధంగానే చంద్ర‌బాబు పొలిటిక‌ల్ గ్లామ‌ర్ పై బాగానే దెబ్బ‌కొట్టింది.డీ గ్లామ‌రైజ్డ్ వెర్ష‌న్ ఒక‌టి వెలికి తెచ్చి చంద్ర‌బాబు విష‌యంలో అదేంట‌న్న‌ది ఎలా ఉంటుంద‌న్న‌ది కూడా చెప్పేందుకు వైసీపీ ప్ర‌య‌త్నించింది.అదేవిధంగా చంద్ర‌బాబు కూడా త‌గ్గేదేలే అన్న విధంగానే కుప్పంలో పోయిన ప‌రువు ద‌క్కించుకునేందుకు తెగ ఆరాట ప‌డ‌డం విశేషం.అంతేకాదు ఆయ‌న‌కు స‌మీపంగా కొన్ని పార్టీ శ్రేణులు కూడా వ‌చ్చాయి.. విమ‌ర్శ‌లు చేయ‌డానిక!

ఇక మైనింగ్ అంశం ఒక‌టి పైకి రావ‌డంతో బాబు మ‌రింత అల‌ర్ట్ అయిపోయారు.కుప్పంలో మైనింగ్ అవుతున్న ప్రాంతాల‌కు కాలిన‌డ‌కన పోయి  ప‌రిశీలించి వ‌చ్చారు. శాంతిపురం మండ‌లం, సి.బండ‌ప‌ల్లి పంచాయతీ ప‌రిధిలో ముద్ద‌న‌ప‌ల్లె, ద్ర‌విడ వ‌ర్శిటీ ప‌రిస‌ర ప్రాంతాలలో నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా సాగిపోతున్న మైనింగ్ ప్రాసెస్ ను ప‌రిశీలించి,అధికార పార్టీ అరాచ‌కాల‌ను వెలుగులోకి తీసుకువ‌చ్చే ప్ర‌య‌త్నం ఒక‌టి చేశారు.సుమారు మూడు గంట‌ల‌కు పైగా ఇక్క‌డికి చేరుకునేందుకు శ్ర‌మించారు అని ప్ర‌ధాన మీడియా చెబుతోంది. కుప్పంలో గ‌తంలో క‌న్నా వేగంగా మైనింగ్ అయిపోతుంది అంటే వైసీపీ పట్టు పెంచుకుంద‌నే క‌దా! అలాంట‌ప్పుడు స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న చంద్ర‌బాబు ఇంత‌వ‌ర‌కూ ఏంచేస్తున్నార‌ని?  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: