వారెవ్వా.. నోరూరించే మామిడి పండ్లతో.. వైన్ తయారీ?
సాధారణంగా వైన్ ఎలా తయారు చేస్తారు అన్న విషయం పై దాదాపుగా అందరికీ ఒక క్లారిటీ ఉండే ఉంటుంది. ద్రాక్ష పండ్ల నుంచి వైన్ తయారు చేస్తూ ఉంటారు. ఇక వైన్ తాగడం వల్ల అటు గ్లామర్ కూడా పెరుగుతుందని కొంతమంది భావిస్తూ ఉంటారు. అందుకే ఎక్కువగా వైన్ తాగడానికి ఇష్టపడుతుంటారు. అయితే ఇప్పటివరకు ద్రాక్ష పండ్ల తో తయారు చేసే వైన్ గురించి మాత్రమే అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు మాత్రం నోరూరించే మామిడి పళ్ళ తో కూడా వైన్ తయారు చేయబోతున్నారు అని అర్థమవుతుంది.
ద్రాక్ష ఉత్పత్తి సరిగా లేకపోతే వేరే పండ్లతో వైన్ తయారు చేయవచ్చా లేదా అనే ఆలోచన చేశారు ఉత్తరప్రదేశ్లోని ఎక్సైజ్ శాఖ అధికారులు. ఈ క్రమంలోనే ఈ దిశగా ప్రయత్నం చేయడం మొదలుపెట్టారు. కాస్త వినూత్నంగా ఆలోచించి అందుబాటులో లేని ద్రాక్ష పండ్లతో కాకుండా తమకు ఎప్పుడూ అందుబాటులో ఉండే మామిడి పండ్లతో తయారు వైన్ చేయాలి అని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే దీనికోసం మద్యం విధానాన్ని సవరించాలి అంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు యూపీ ఎక్సైజ్ శాఖ అధికారులు. ప్రభుత్వం ఎక్సైజ్ శాఖ అధికారులు పంపిన ప్రతిపాదనలకు ఆమోదం తెలపగానే మ్యాంగో వైన్ తయారీ ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది.