విశాఖ సిటీలో వైసీపీకి గ్రిప్ పెరిగిందా...?

VUYYURU SUBHASH
టీడీపీ హ్యాండ్ ఓవర్‌లో ఉన్న విశాఖపట్నం నగరాన్ని వైసీపీ కైవసం చేసుకోవడానికి ఎన్ని ఎత్తులు వేస్తూ వస్తుందో చెప్పాల్సిన పని లేదు. గత ఎన్నికల్లో అంతటి జగన్ గాలిలో కూడా సిటీలో ఉన్న నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ గెలిచింది. దీంతో సిటీలో టీడీపీని దెబ్బతీయడానికి వైసీపీ తమదైన శైలిలో వ్యూహాలు వేస్తూ వచ్చింది. ముఖ్యంగా విజయసాయిరెడ్డి లాంటి వారు వైసీపీని దెబ్బతీయడానికి గట్టిగానే ట్రై చేశారు. అలాగే చాలా వరకు సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ఎందుకంటే కీలకమైన విశాఖ కార్పొరేషన్‌ని వైసీపీనే కైవసం చేసుకుంది.

అలాగే సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌ని వైసీపీలోకి తీసుకొచ్చారు. అలాగే మిగిలిన నియోజకవర్గాల్లో టీడీపీని దెబ్బకొట్టడానికి గట్టిగానే ట్రై చేశారు. ఇప్పుడు నియోజకవర్గాల వారీగా పరిస్తితిని చూసుకుంటే..విశాఖ సౌత్‌ ఎమ్మెల్యే వాసుపల్లి ఎలాగో వైసీపీలోకి వెళ్ళిపోయారు. ఆయనే వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీకి దిగే అవకాశం ఉంది. ఇటీవలే ఇక్కడ టీడీపీ ఇంచార్జ్‌గా గండి బాబ్జీని పెట్టారు. మరి బాబ్జీ ఏ మేర వాసుపల్లికి పోటీ ఇస్తారో చూడాలి. ప్రస్తుతానికైతే వాసుపల్లి స్ట్రాంగ్‌గా ఉన్నట్లు కనిపిస్తున్నారు.

ఇటు నార్త్ స్థానంలో ఎమ్మెల్యేగా గంటా శ్రీనివాసరావు...ఇక ఈయన సరిగ్గా పనిచేయడం లేదనే సంగతి తెలిసిందే. దీంతో ఇక్కడ టీడీపీ వీక్ అయింది. ఇదే సమయంలో వైసీపీ ఇంచార్జ్ కే‌కే రాజు బాగానే పుంజుకున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో రాజుకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక విశాఖ ఈస్ట్‌లో హ్యాట్రిక్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ ఉన్నారు. ఈయనని వీక్ చేయడానికి వైసీపీ తీవ్ర ప్రయత్నాలే చేసింది. అయితే కొంతవరకు వెలగపూడిని వీక్ చేసినట్లే కనిపిస్తున్నారు. ఇక్కడ వైసీపీ ఇంచార్జ్‌గా అక్రమాని విజయనిర్మల ఉన్నారు. ఆమె ఇప్పుడు స్ట్రాంగ్ అయినట్లు ఉన్నారు.

వెస్ట్ విషయానికొస్తే గణబాబు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయన పార్టీలతో సంబంధం లేనట్లుగా పనిచేసుకుంటూ వెళుతున్నారు. ప్రజల మధ్యలోనే ఉండటం వల్ల ఈయనకు అంత యాంటీ రాలేదు. ఇక్కడ వైసీపీ ఇంచార్జ్‌గా మళ్ల విజయ్ ప్రసాద్ ఉన్నారు. ఈయన అంతగా పికప్ అయినట్లు లేరు. మొత్తానికి చూసుకుంటే విశాఖ సిటీపై వైసీపీకి గ్రిప్ పెరిగినట్లే కనిపిస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: