సీమలో ఆటోమొబైల్ హబ్...ఎక్కడంటే ?


 రతనాలు రాసులు గా పోసి విక్రయించిన చరిత్ర రాయలసీమదని చరిత్రకారులు చెబుతున్నా...ప్రస్తుతం అక్కడి వాసుల జీనవ స్థితిగతులు ఏమాత్రం మెరుగ్గా లేవు. ఈ క్రమంలో అక్కడి ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అక్కడ ఆటోమొబైల్ హబ్ నెలకొల్పేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇంతకీ ఎక్కడ ఆ పారిశ్రామిక వాడ ఏర్పాటవుతుందో తెలుసా ?
 ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి , ఆయన కుటుంబానికి అండగా నిలిచిన ప్రాంతం రాయలసీమ. ఇది ఎవరూ కాదనలేని సత్యం. రాయల సీమ వాసుల కష్టాలు తీర్చేందుకు, అక్కడి జనాల జీవన స్థితిగతులు తీర్చేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సంకల్పించింది. పదిహేడు వేల మందికి ప్రత్యక్షంగా, మరో పాతిక వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఏపిఐఐసి ఆధ్వర్యంలో పారిశ్రామిక వాడ ను ఏర్పాటు చేయనుంది. ఈ పారిశ్రామ వాడకు సంబంధించిన పనులు, పర్యావరణ అనుమతలు రావాల్సి ఉన్న కారణంగా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం నుంచి  అదేనండీ పర్యావరణ శాఖ నుంచి అనుమతులు రావడం తో ఈ విషయాన్ని అధికార వర్గాలు బహిర్గతం చేశాయి. పారిశ్రామిక వాడలో తయారైన ఉత్పత్తుల రవాణాకు వాయు మార్గం, నౌకా మార్గం దగ్గరగా ఉండాల్సిన అవసరం ఉందని భావించిన ఉన్నత స్థాయి అధికారులు విమానాశ్రయానికి, నౌకా మార్గానికి సమీపంలో పారిశ్రామిక వాడ ఏర్పాటుకు స్థలం గుర్తించాల్సి వచ్చింది. కానీ  సీమ జిల్లాల నుంచి నౌకా  మార్గం  లేదు. దీంతో అధికారులు ఆలోచనలో పడ్డారు. రాయలసీమ కు సమీపాన తమిళనాడు రాజధాని చెన్నై నగరం ఉండటం, చెన్నై నుంచి నౌకా మార్గం ద్వారా పెద్ద సంఖ్యలో నౌకల ద్వారా రవాణా సదుపాయాలుండటంతో ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు సరిహద్దులో పారిశ్రామిక వాడ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. తిరుపతి నగరం,చిత్తూరు నగరం, చెన్నై నగరాలకు సమీపంలో  రాయలసీమ సరిహద్దులో  కోశల నగరం అనే ప్రాంతంలో ఆటోమొబైల్ హబ్ కు అనుకూల ప్రాంతంగా అధికారులు గుర్తించారు. ఈ ప్రాంతం చిత్తూరు జిల్లా సరిహద్దులోకి వస్తుంది. ఇక్కడ 2300 ఎకరాలలో ఈ ఆటోమొబైల్ హబ్ ఏర్పాటు కానుంది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: